Padma Vibhushan Awardee: పండిట్ బిర్జూ మహరాజ్ ఏ నృత్యంలో ప్రసిద్ధి చెందాడు?
ప్రఖ్యాత కథక్ నాట్య కళాకారుడు, పండిట్ బిర్జూ మహరాజ్ (84) కన్నుమూశారు. గుండెపోటు కారణంగా జనవరి 18న న్యూఢిల్లీలో తుదిశ్వాస విడిచారు. భారతదేశ సంప్రదాయ నృత్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకువచ్చిన ఆయన ఎన్నో దేశాల్లో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. నాట్యరంగంలో చేసిన విశేష కృషికిగాను పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. కమలహాసన్ నటించిన విశ్వరూపం సినిమాకు కొరియోగ్రఫీ అందించినందుకు ఆయనకు జాతీయ పురస్కారం లభించింది.
టోంగా సముద్రగర్భంలో.. అగ్నిపర్వతం పేలుడు
దక్షిణ ఫసిఫిక్ సముద్రంలోని ద్వీపకల్పమైన టోంగాలో సముద్ర గర్భంలోని అగ్నిపర్వతం జనవరి 15న బద్దలవడంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. సముద్రం లోపల ఉన్న హుంగా టోంగా హాపై అనే అగ్నిపర్వతం వరసగా రెండు రోజులు పేలడంతో టోంగా వ్యాప్తంగా బూడిద మేఘాలు కమ్ముకున్నాయి. ఈ బూడిద 19 కి.మీ.ఎత్తువరకు వ్యాపించినట్లు టోంగా జియోలాజికల్ సర్వే తెలిపింది. దీని వల్ల ఎంత నష్టం జరిగిందనేది తెలియలేదు.
చదవండి: ఎయిర్ ఇండియా చీఫ్‌గా నియమితులైన ఐఏఎస్ అధికారి?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రఖ్యాత కథక్ నాట్య కళాకారుడు, పద్మవిభూషణ్ అవార్డీ కన్నుమూత
ఎప్పుడు : జనవరి 18
ఎవరు : పండిట్ బిర్జూ మహరాజ్ (83)
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : గుండెపోటు కారణంగా..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్