Senior Bureaucrat: ఎయిర్ ఇండియా చీఫ్‌గా నియమితులైన ఐఏఎస్ అధికారి?
సీనియర్ స్థాయి బ్యూరోక్రాటిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా... సీనియర్ బ్యూరోక్రాట్ విక్రమ్ దేవ్ దత్ ఎయిర్ ఇండియా లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ)గా నియమితులయ్యారు. 1993 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన విక్రమ్ ప్రస్తుతం ఢిల్లీ ప్రభుత్వంలో పర్యాటక శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా 1991 బ్యాంచ్ ఐఏఎస్ అధికారి మనిష్ కుమార్ గుప్తా ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (డీడీఏ) వైస్ చైర్మన్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన డీడీఏలో ప్రిన్సిపల్ కమిషనర్‌గా ఉన్నారు. ఎయిర్ ఇండియా ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
‘బిగ్‌బాష్’ మ్యాచ్ ఆడిన తొలి భారతీయ క్రికెటర్‌గా...
ఆస్ట్రేలియాకు చెందిన బిగ్‌బాష్ టి20 లీగ్ టోర్నీలో మ్యాచ్ ఆడిన తొలి భారతీయ క్రికెటర్‌గా ఉన్ముక్త్ చంద్ గుర్తింపు పొందాడు. హోబర్ట్ హరికేన్స్‌తో జనవరి 18న జరిగిన మ్యాచ్‌లో మెల్‌బోర్న్ రెనెగెడ్స్ తరఫున ఉన్ముక్త్ బరిలోకి దిగి ఆరు పరుగులు చేశాడు. 2012లో ఉన్ముక్త్ కెప్టెన్సీలో టీమిండియా అండర్–19 ప్రపంచకప్ టైటిల్ గెలిచింది. బీసీసీఐ రూల్స్ ప్రకారం భారత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆటగాళ్లకే విదేశీ టి20 లీగ్‌లలో ఆడే అర్హత ఉంది. దాంతో 28 ఏళ్ల ఉన్ముక్త్ 2021, ఆగస్టులో రిటైర్మెంట్ ప్రకటించాడు.
చదవండి: రాష్ట్ర శాసన మండలి ప్రొటెమ్ చైర్మన్‌గా నియమితులైన నేత?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎయిర్ ఇండియా లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్(సీఎండీ)గా నియమితులైన ఐఏఎస్ అధికారి?
ఎప్పుడు : జనవరి 18
ఎవరు : సీనియర్ బ్యూరోక్రాట్ విక్రమ్ దేవ్ దత్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : సీనియర్ స్థాయి బ్యూరోక్రాటిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్