Pakistan Army: ఐఎస్‌ఐ చీఫ్‌గా నియమితులైన లెఫ్టినెంట్ జనరల్?
పాకిస్తాన్ ఆర్మీ తమ సైనికాధికారుల పదవుల్లో కీలక మార్పులు చేసింది. పాక్ గూఢచార విభాగమైన ఇంటర్–సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ) చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ నదీమ్ అంజుమ్‌ను నియమించింది. ఇప్పటి వరకూ ఐఎస్‌ఐ చీఫ్‌గా పని చేసిన లెఫ్టినెంట్ జనరల్ ఫయాజ్ హమీద్‌ను పెషావర్ కార్ప్స్ కమాండర్‌గా నియమించింది. ఈ రెండు విభాగాలు పాకిస్తాన్ ఆర్మీలో అత్యంత కీలకమైనవి. సాధారణంగా పాక్ ఆర్మీ సూచన మేరకు ప్రధాన మంత్రి ఐఎస్‌ఐ చీఫ్‌ను నియమిస్తారు.
నైపుణ్యాలు కలిగిన వ్యక్తిగా...
ఐఎస్‌ఐ చీఫ్ నదీమ్ పంజాబ్ రెజిమెంట్‌కు చెందినవారు. కరాచీ కార్ప్స్ కమాండర్‌గానూ, క్వెట్టాలో కమాండ్ స్టాఫ్ కాలేజ్ కమాండంట్‌గానూ బాధ్యతలు నిర్వహించారు. కీలకమైన నైపుణ్యాలు కలిగిన వ్యక్తిగా నదీమ్‌కు పేరుంది.
రావణ పాత్రధారి అరవింద్ త్రివేది కన్నుమూత
1986లో వచ్చిన రామాయణం సీరియల్‌లో రావణుడి పాత్ర పోషించిన ప్రముఖ నటుడు అరవింద్ త్రివేది కన్నుమూశారు. గుండెపోటు కారణంగా అక్టోబర్ 5న ముంబైలో తుదిశ్వాస విడిచారు. 1991లో అరవింద్ బీజేపీ తరఫున సబర్కాతా నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. 1996 వరకు ఆయన ఎంపీగా సేవలందించారు.
చదవండి: మిలటరీ నర్సింగ్ సర్వీస్ ఏడీజీగా బాధ్యతలు చేపట్టిని అధికారిణి?
క్విక్ రివ్యూ :
ఏమిటి : పాకిస్తాన్ గూఢచార విభాగమైన ఇంటర్–సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ) చీఫ్‌గా నియామకం
ఎప్పుడు : అక్టోబర్ 6
ఎవరు : లెఫ్టినెంట్ జనరల్ నదీమ్ అంజుమ్
ఎందుకు : పాకిస్తాన్ ఆర్మీ నిర్ణయం మేరకు...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్
డౌన్‌లోడ్ వయా ఆపిల్ ఐ స్టోర్