MNS ADG: మిలటరీ నర్సింగ్ సర్వీస్ ఏడీజీగా బాధ్యతలు చేపట్టిని అధికారిణి?
మిలటరీ నర్సింగ్ సర్వీస్ అడిషనల్ డైరెక్టర్ జనరల్(ఏడీజీ)గా మేజర్ జనరల్ స్మితా దేవరాని అక్టోబర్ 1న న్యూఢిల్లీలో బాధ్యతలు చేపట్టారు. సికింద్రాబాద్ మిలటరీ హాస్పిటల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ పూర్వ విద్యార్థిని అయిన దేవరాని ఢిల్లీ యూనివర్సిటీ నుంచి పట్టభద్రురాలు అయ్యారు. 1983లో మిలటరీ నర్సింగ్ సర్వీస్‌లో చేరారు. సింగపూర్‌లోని నేషనల్ హెల్త్‌కేర్ అకాడమీ నుంచి క్వాలిటీ కంట్రోల్ మేనేజ్‌మెంట్, ఇన్‌ఫెక్షన్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ మేనేజ్‌మెంట్‌లకు ఆరు సిగ్మా సర్టిఫికెట్‌లు పొందారు.
ఎల్‌ఐసీ ఎండీగా పట్నాయక్...
ఎల్‌ఐసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా బీసీ పట్నాయక్ బాధ్యతలు స్వీకరించారు. ఈ విషయాన్ని సంస్థ అధికారికంగా అక్టోబర్ 1న ప్రకటించింది. ఈ బాధ్యతలకు ముందు.. కౌన్సిల్ ఫర్ ఇన్సూరెన్స్ అంబుడ్స్‌మన్ (ముంబై)కు సెక్రటరీ జనరల్‌గా పట్నాయక్ పనిచేశారు. ప్రస్తుతం ఎల్‌ఐసీకి ఒక చైర్మన్, నలుగురు ఎండీలు పనిచేస్తున్నారు.టెలికం కార్యదర్శిగా కే రాజారామన్...
టెలికం కార్యదర్శిగా తమిళనాడు కేడర్ ఐఏఎస్ అధికారి కే రాజారామన్ అక్టోబర్ 1న ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించారు. అన్షూ ప్రకాశ్ సెప్టెంబర్ 30న పదవీ విరమణ నేపథ్యంలో రాజారామన్ నియామకం జరిగింది. ఈ నియామకానికి ముందు ఆయన ఆర్థిక వ్యవహారాల శాఖలో పెట్టుబడులకు సంబంధించి విభాగం అదనపు కార్యదర్శిగా పనిచేశారు.చదవండి: వైమానిక దళం కొత్త చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన ఎయిర్ మార్షల్?
క్విక్ రివ్యూ :
ఏమిటి : మిలటరీ నర్సింగ్ సర్వీస్ అడిషనల్ డైరెక్టర్ జనరల్(ఏడీజీ)గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : అక్టోబర్ 1
ఎవరు : మేజర్ జనరల్ స్మితా దేవరాని
ఎక్కడ : న్యూఢిల్లీ