Skip to main content

M.S Swaminathan passes away: హ‌రిత విప్ల‌వ పితామ‌హుడు... వ‌రిలో మేలైన వంగ‌డాలు... ఇలా మరెన్నో!!

M.S స్వామినాథ‌న్(98) చెన్నైలోని త‌న ఇంట్లో తుది శ్వాస విడిచారు. M.S స్వామినాథ‌న్ 1925 ఆగ‌ష్టు 27న అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని కుంభకోణంలో జ‌న్మించారు. హ‌రిత విప్ల‌వ పితామ‌హిడిగా M.S స్వామినాథ‌న్ పేరుగాంచారు . M.S స్వామినాథ‌న్ వ‌రిలో మేలైన వంగ‌డాల‌ను సృష్టించారు. 
M.S Swaminathan, father of Haritha Revolution, Superior Vangadala Rice, chennai
M.S Swaminathan

M.S స్వామినాథ‌న్  విద్యాభ్యాసం

M.S స్వామినాథ‌న్ తండ్రి ఎంకే సాంబశివన్‌ సర్జన్‌. మెట్రిక్యులేషన్‌ పూర్తయిన తర్వాత స్వామినాథన్‌ కూడా తండ్రి బాటలోనే మెడికల్‌ స్కూల్లో చేరారు. కానీ, 1943లో బెంగాల్‌లో చోటుచేసుకున్న క్షామన్ని కళ్లారా చూసిన ఆయన తన మనసు మార్చుకుని వ్యవసాయ పరిశోధనల వైపు అడుగువేశారు. త్రివేంద్రంలోని మహారాజా కాలేజీలో జువాలజీ నుంచి డిగ్రీ పట్టా పొందిన ఆయన.. ఆ తర్వాత మద్రాసు అగ్రికల్చరల్ కాలేజీలో చేరారు. అగ్రికల్చరల్‌ సైన్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత దిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (IARI)లో పీజీ చదివారు.

Nielsen New CEO: నీల్సన్‌ సీఈవోగా కార్తీక్‌ రావు

పీజీ పూర్తయిన తర్వాత స్వామినాథన్‌ యూపీఎస్సీ పరీక్ష రాసి ఐపీఎస్‌కు అర్హత సాధించారు. కానీ, ఆ అవకాశాన్ని వదులుకుని యునెస్కో ఫెలోషిప్‌తో నెదర్లాండ్స్‌లోని అగ్రికల్చరల్‌ యూనివర్సిటీలో చేరారు. అక్కడ బంగాళదుంప జన్యుపరిణామంపై అధ్యయనం చేశారు. అక్కడి నుంచి కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌లో చేరి పీహెచ్‌డీ పూర్తిచేశారు. కొంతకాలం అక్కడ పనిచేసిన ఆయన.. 1954లో భారత్‌కు తిరిగొచ్చి IARIలో శాస్త్రవేత్తగా రీసెర్చ్‌ కొనసాగించారు.

హరిత విప్లవం:

స్వామినాథన్‌ను తరచుగా "భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు" అని పిలుస్తారు. 1960-1970లలో భారతదేశంలో వ్యవసాయ ఉత్పాదకతను గణనీయంగా పెంచి ఆహార కొరతను తగ్గించడంలో సహాయపడిన... ఆధునిక వ్యవసాయ పద్ధతులతో పాటు అధిక దిగుబడినిచ్చే గోధుమలు, వరి రకాలను పరిచయం చేయడం ప్రోత్సహించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

స్వామినాథన్ రచనలు భారతదేశంలో వ్యవసాయం, ఆహారోత్పత్తిపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి... లక్షలాది మంది రైతుల జీవనోపాధిని మెరుగుపరచడంలో సహాయపడ్డాయి. వ్యవసాయ పరిశోధనల పట్ల ఆయనకున్న అంకితభావం... ఆయనను ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో గౌరవనీయ వ్యక్తిగా మార్చింది.

ED In-charge director: ఈడీ ఇన్‌ఛార్జ్‌ డైరెక్టర్‌గా రాహుల్‌ నవీన్‌

M.S స్వామినాథ‌న్ హోదాలు

1972-79 మధ్య ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ జనరల్‌గా వ్యవహరించారు. ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియాలో కీలక పాత్ర పోషించారు. 1979లో కేంద్ర ప్రభుత్వం ఆయన్ను వ్యవసాయ శాఖకు ప్రిన్సిపల్‌ సెక్రటరీగా నియమించింది. 1988లో స్వామినాథన్ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్స్‌కి అధ్యక్షుడయ్యారు.

పురస్కారాలు

స్వామినాథ‌న్‌కు 1961లో శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు, 1967లో పద్మశ్రీ, 1972లో పద్మభూషణ్, 1986లో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వరల్డ్ అవార్డ్ ఆఫ్ సైన్స్, 1989 పద్మ విభూషణ్ పురస్కారాలు వ‌రించాయి

SPG director passes away: ప్రధాని భద్రతా బృందం ఎస్పీజీ డైరెక్టర్‌ కన్నుమూత

Published date : 29 Sep 2023 10:28AM

Photo Stories