Ram Narain Agarwal: ‘అగ్ని’ తొలి డైరెక్టర్ రామ్ నారాయణ్ కన్నుమూత
ఆగస్టు 15వ తేదీ ఆయన హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. భూతల (surface-to-surface missile) క్షిపణి.. భారత క్షిపణుల్లో మణిహారంగా పేర్కొనే ‘అగ్ని’ని రూపొందించడంలో ఈయనదే ప్రముఖ పాత్ర. అందుకే ఆర్‌ఎన్ అగర్వాల్‌ను ఫాదర్ ఆఫ్ ది అగ్ని సిరీస్ ఆఫ్ మిస్సైల్స్‌గా పిలుస్తుంటారు.
రామ్ నారాయణ్ అగర్వాల్ రాజస్థాన్‌లోని జైపూర్‌లో వ్యాపారుల కుటుంబంలో జన్మించారు. బెంగుళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. అనంతరం ప్రోగ్రాం డైరెక్టర్‌గా (AGNI), డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లాబొరేటరీ డైరెక్టర్‌గా పనిచేశారు.
ఈయన 1983లో ప్రారంభమైన ‘అగ్ని క్షిపణి’ ప్రోగ్రామ్‌లో చేరారు. 33 ఏళ్ల క్రితం మే 22 1989న.. ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా ఉన్న అగర్వాల్.. తన బృందంతో కలిసి 1000 కిలోల పేలోడ్‌తో 800 కి.మీపైగా అగ్ని క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. ఈ మీడియం రేంజ్ బాలిస్టిక్ క్షిపణిని ఒడిశా తీరంలోని బాలాసోర్‌లోని చండీపూర్‌లో ప్రయోగించారు.
Natwar Singh: కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్ కన్నుమూత
రక్షణ రంగంలో ఈయన చేసిన కృషికి గానూ భారత ప్రభుత్వం 1990లో పద్మశ్రీ, 2000 సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డులతో సత్కరించింది.