Skip to main content

PM Modi: మోడీ ఎట్‌ 20: డ్రీమ్స్‌ మీట్‌ డెలివరీ పుస్తకం ఆవిష్కరణ

Modi@20: Dreams Meet Delivery

ముఖ్యమంత్రిగా, ప్రధానిగా పలు రంగాల్లో 20 ఏళ్ల పాటు ప్రధాని నరేంద్ర మోదీ పనితీరుకు సంబంధించిన పలు అంశాలపై 22 మంది నిపుణులు రాసిన 21 కథనాల సంకలనం ‘మోడీ ఎట్‌ 20: డ్రీమ్స్‌ మీట్‌ డెలివరీ’ పుస్తకం విడుదలైంది. మే 11న  న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రజా పోరాటాలపై లోతైన అవగాహన, కలలుగనే ధైర్యం, కృషి, అభిరుచి, శక్తి, దృఢ నిశ్చయం ప్రధాని మోదీ విజయ రహస్యాలని వెంకయ్య పేర్కొన్నారు.

GK Science & Technology Quiz: నాసాకు చెందిన పార్కర్ సోలార్ ప్రోబ్ ఏ గ్రహ ఉపరితలాన్ని చిత్రీకరించింది?

కాంగ్రెస్‌ నేత సుఖ్‌రాం మృతి
కాంగ్రెస్‌ కురువృద్ధ నేత సుఖ్‌రాం (94) న్నుమూశారు. బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడంతో మే 7న హిమాచల్‌ప్రదేశ్‌లోని స్వస్థలం మండి నుంచి ఆయనను ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మే 11న తుదిశ్వాస విడిచారు. ఆయన 1993–96 మధ్య పీవీ నరసింహారావు ప్రభుత్వంలో కేంద్ర సమాచార మంత్రిగా పని చేశారు. టెలికాం కుంభకోణంలో చిక్కుకోవడంతో కాంగ్రెస్‌ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఆ కేసులో 2011లో ఆయనకు 15 ఏళ్ల జైలుశిక్ష పడింది.​​​​​​​Israeli–Palestinian Conflict: కాల్చివేతకు గురైన అల్‌ జజీరా మహిళా జర్నలిస్టు?​​​​​​​

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 12 May 2022 03:53PM

Photo Stories