కరెంట్ అఫైర్స్ (శాస్త్ర, సాంకేతికం) ప్రాక్టీస్ టెస్ట్ (12-18, February 2022)
1. భారతదేశంలోని ఏ సొరంగాన్ని '10,000 అడుగుల పైన ఉన్న ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైవే టన్నెల్'గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించింది?
ఎ. జోజి-లా టన్నెల్
బి. బనిహాల్ ఖాజిగుండ్ రోడ్ టన్నెల్
సి. అటల్ టన్నెల్
డి. డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ రోడ్ టన్నెల్
- View Answer
- Answer: సి
2. ఇటీవల వార్తల్లో కనిపించిన MUSE మల్టీ-స్లిట్ సోలార్ ఎక్స్‌ప్లోరర్, హీలియోస్వార్మ్ అనే రెండు కొత్త సైన్స్ మిషన్ల ను ఏ అంతరిక్ష సంస్థతో అనుసంధానించారు?
ఎ. నాసా
బి. ఇస్రో
సి. జాక్సా
డి. ESA
- View Answer
- Answer: ఎ
3. ఏ జాతిని ‘అంతరించిపోతున్నది’గా ఆస్ట్రేలియా పేర్కొంది?
ఎ. స్లాత్
బి. పాండా
సి. కంగారు
డి. కోలా
- View Answer
- Answer: డి
4. మహమ్మారి పేరు మీద కొత్తగా కనుగొన్న 'హంబెర్టియం కోవిడమ్' జాతి?
ఎ. ఫ్లాట్‌వార్మ్
బి. హౌస్ ఫ్లై
సి. హౌస్ ర్యాట్
డి. పాము
- View Answer
- Answer: ఎ
5. ఏ సంవత్సరం నాటికి నికర-సున్నా కార్బన్ ఉద్గారాలను సాధించడానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది?
ఎ. 2030
బి. 2050
సి. 2070
డి. 2060
- View Answer
- Answer: సి
6. తన సొంత రేడియో ఛానెల్‌ని ప్రారంభించిన సెంట్రల్ జైలు?
ఎ. ఇండోర్ సెంట్రల్ జైలు
బి. జైపూర్ సెంట్రల్ జైలు
సి. భోపాల్ సెంట్రల్ జైలు
డి. కాన్పూర్ సెంట్రల్ జైలు
- View Answer
- Answer: ఎ
7. నాసాకు చెందిన పార్కర్ సోలార్ ప్రోబ్ ఏ గ్రహ ఉపరితలాన్ని చిత్రీకరించింది?
ఎ. శుక్రుడు
బి. బృహస్పతి
సి. అంగారకుడు
డి. శని
- View Answer
- Answer: ఎ
8. నేషనల్ రివర్ ఇంటర్‌లింకింగ్ పాలసీ కింద ఏర్పాటైన మొదటి సంస్థ?
ఎ. కావేరీ-గోదావరి లింక్ ప్రాజెక్ట్ అథారిటీ
బి. గోదావరి-కృష్ణా లింక్ ప్రాజెక్ట్ అథారిటీ
సి. కెన్-బెట్వా లింక్ ప్రాజెక్ట్ అథారిటీ
డి. నర్మదా-తపి లింక్ ప్రాజెక్ట్ అథారిటీ
- View Answer
- Answer: సి
9. పౌర గగనతలంలో డ్రోన్లు పనిచేయడానికి అనుమతించిన ప్రపంచంలో మొట్టమొదటి దేశం?
ఎ. అమెరికా
బి. ఫ్రాన్స్
సి. జర్మనీ
డి. ఇజ్రాయెల్
- View Answer
- Answer: డి
10. మొట్టమొదటి హ్యాకథాన్ సైన్య రణక్షేత్రం ను నిర్వహించినది?
ఎ. భారత సైన్యం
బి. DRDO
సి. నీతి ఆయోగ్
డి. నాబార్డ్
- View Answer
- Answer: ఎ
11. ప్రపంచంలో తొలిసారిగా మహిళకు ఏ ప్రక్రియ ద్వారా HIV నయమైంది?
ఎ. యాంటీరెట్రోవైరల్ థెరపీ
బి. రక్త మార్పిడి
సి. స్టెమ్ సెల్ (మూలకణ) మార్పిడి
డి. క్షయవ్యాధి చికిత్స
- View Answer
- Answer: సి