Israeli–Palestinian Conflict: కాల్చివేతకు గురైన అల్ జజీరా మహిళా జర్నలిస్టు?
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ఘర్షణలు జరుగుతున్న వెస్ట్‌బ్యాంక్ సిటీలో కవరేజీ సందర్భంగా అల్ జజీరా చానల్ మహిళా జర్నలిస్టు షిరీన్ అబు అక్లా (51) ప్రాణాలు కోల్పోయారు. మరో జర్నలిస్టు అలీ సమోదీ కాల్పుల్లో తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతున్నారు. ఇజ్రాయెల్ ఆర్మీయే ఈ దారుణానికి పాల్పడిందని అల్ జజీరా ఆరోపించింది. ఇజ్రాయెల్ సైనికులు షిరీన్ తలపై నేరుగా తుపాకీ పెట్టి కాల్చడంతో అక్కడికక్కడే చనిపోయినట్టు పాలస్తీనా కూడా చెబుతోంది. ఈ ఆరోపణల్ని ఇజ్రాయెల్ తోసిపుచ్చింది. పాలస్తీనా ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉంటారంది.
బులెట్‌ప్రూఫ్ జాకెట్ వేసుకున్నా..
కవరేజీ సమయంలో షిరీన్ తలకు హెల్మెట్ పెట్టుకున్నారు. బులెట్ ప్రూఫ్ జాకెట్ ధరించారు. దానిపై ప్రెస్ అని రాసుంది. ఆమె చెవి కింద తూటా గాయాలైనట్టుగా తెలుస్తోంది. దీనిపై విచారణకు ఇజ్రాయెల్ ప్రధాని నాఫ్తాలి బెన్నెట్ ఆదేశించారు.ISTA: ఇస్టా అధ్యక్షుడిగా ఎంపికకానున్న మొదటి ఆసియా వ్యక్తి?
క్విక్ రివ్యూ :
ఏమిటి : కాల్చివేతకు గురైన అల్ జజీరా మహిళా జర్నలిస్టు?
ఎప్పుడు : మే 11
ఎవరు : షిరీన్ అబు అక్లా (51)
ఎక్కడ : వెస్ట్‌బ్యాంక్ సిటీ, ఇజ్రాయెల్
ఎందుకు : ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ఘర్షణలు జరుగుతున్న వెస్ట్‌బ్యాంక్ సిటీలో కవరేజీ సందర్భంగా..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్