ISTA: ఇస్టా అధ్యక్షుడిగా ఎంపికకానున్న మొదటి ఆసియా వ్యక్తి?
The International Seed Testing Association (ISTA): అంతర్జాతీయ విత్తన పరీక్షల సంఘం(ఇస్టా) అధ్యక్షుడిగా తెలంగాణ విత్తనా భివృద్ధి సంస్థ ఎండీ ప్రొఫెసర్ కేశవులు పేరు ఖరారైంది. ప్రస్తుతం ఈజిప్ట్ రాజధాని కైరోలో జరుగుతున్న ఇస్టా అంతర్జాతీయ కాంగ్రెస్‌లో ఆయన పేరును నేడో రేపో అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ పదవికి ఎంపికవుతున్న మొదటి భారతీయుడు, మొదటి ఆసియా వ్యక్తి కూడా డాక్టర్ కేశవులే. 2019లో హైదరాబాద్‌లో జరిగిన ఇస్టా అంతర్జాతీయ కాంగ్రెస్‌లో ఆయన ఉపాధ్యక్షుడిగా ఎంపికైన సంగతి విదితమే.
అధిక దిగుబడులు సాధించడానికి, మెరుగైన విత్తనాలు అందేందుకు నాణ్యత పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్ అందించడమే ఇస్టా లక్ష్యం. ల్యాబ్‌లో విత్తనాల నాణ్యతను గుర్తించి అవి సరైన ప్రమాణాలతో ఉన్నాయని తేలితేనే ఇస్టా సర్టిఫికేషన్ ఇస్తారు. ఇస్టా ప్రధాన కార్యాలయం స్విట్జర్‌లాండ్‌లో ఉంది. ప్రస్తుతం దీని అధ్యక్షుడిగా స్టీవ్ జోన్స్ ఉన్నారు.Philippine presidential election 2022: ఫిలిప్పీన్స్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంతర్జాతీయ విత్తన పరీక్షల సంఘం(ఇస్టా) అధ్యక్షుడిగా ఎంపికకానున్న మొదటి ఆసియా వ్యక్తి?
ఎప్పుడు : మే 10
ఎవరు : తెలంగాణ విత్తనా భివృద్ధి సంస్థ ఎండీ ప్రొఫెసర్ కేశవులు
ఎందుకు : ఇస్టా అంతర్జాతీయ కాంగ్రెస్ నిర్ణయం మేరకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్