Philippine presidential election 2022: ఫిలిప్పీన్స్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
ఫిలిప్పీన్స్ అధ్యక్ష ఎన్నికల్లో మార్కోస్ జూనియర్(64) ఘన విజయం సాధించారు. మే 10వ తేదీన 97 శాతం ఓట్ల లెక్కింపు పూర్తయిందని మూడు కోట్లకుపైగా ఓట్లు మార్కోస్‌కే పడినట్లు అనధికార గణాంకాల్లో వెల్లడైంది. కొత్త అధ్యక్షుడు జూన్ 30న బాధ్యతలు చేపడతాడు. 1986లో తండ్రి , ఫిలిప్పీన్స్ నియంత ఫెర్డినాండ్ మార్కోస్‌ను గద్దె దింపిన ఆ ప్రజలే మళ్లీ తనయుడికి పట్టం కట్టడం విశేషం. పేదరికం, మాదకద్రవ్యాలు, సమాజంలో అసమానతలు ఫిలిప్పీన్స్‌ను పట్టిపీడిస్తున్నాయి. మార్కోస్ గెలుపు వార్త తెల్సి మానవహక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆందోళన వ్యక్తంచేసింది.
GK Economy Quiz: రీసైకిల్ చేసిన PVC ప్లాస్టిక్‌తో తయారైన భారతదేశపు మొట్టమొదటి క్రెడిట్ కార్డ్‌ను ప్రారంభించిన సంస్థ? Chief of the Army Staff: ఇంజినీర్స్ విభాగం నుంచి ఆర్మీ చీఫ్‌గా ఎంపికైన మొదటి వ్యక్తి?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫిలిప్పీన్స్ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు?
ఎప్పుడు : మే 10
ఎవరు : మార్కోస్ జూనియర్(64)
ఎందుకు : ఫిలిప్పీన్స్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించినందున..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్