Vice Chief of the Army Staff: భారత ఆర్మీ కొత్త వైస్ చీఫ్‌గా ఎవరు నియమితులయ్యారు?
భారత ఆర్మీ కొత్త వైస్ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ బగ్గవల్లి సోమశేఖర్ రాజు నియమితులయ్యారు. మే 1వ తేదీన ఆయన బాధ్యతలు చేపట్టనున్నారని రక్షణ శాఖ ఏప్రిల్ 29న వెల్లడించింది. ప్రస్తుత వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే ఆర్మీ చీఫ్‌గా నియమితులైన విషయం తెలిసిందే. ప్రస్తుత చీఫ్ జనరల్ ఎంఎం నరవణే ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయనున్నారు.
GK Economy Quiz: 2022-23 ఆర్థిక సంవత్సరంలో RBI భారతదేశ GDP వృద్ధి రేటు అంచనా?
దివాలా కేసులో జైలు శిక్ష విధింపబడిన ఆటగాడు?
దివాలా కేసులో జర్మనీ టెన్నిస్ దిగ్గజం బోరిస్ బెకర్‌కు రెండున్నరేళ్ల జైలు శిక్ష విధించారు. 54 ఏళ్ల బెకర్ తన దగ్గర రుణ చెల్లింపులకు ఏమీ లేదని, దివాలా తీశానని ప్రకటించి... ఉన్న ఆస్తిపాస్తుల్ని దాచి, అక్రమంగా పెద్దమొత్తంలో నగదు బదిలీ చేశాడు. దీనిపై విచారించిన లండన్ కోర్టు దివాలా చట్టం ప్రకారం శిక్ష విధించింది.
జర్మనీలోని బ్యాంక్‌కు 50 లక్షల డాలర్ల (రూ.38.25 కోట్లు) రుణాన్ని చెల్లించకుండా అనైతిక పద్ధతిలో బోరిస్ బెకర్ దివాలా పిటిషన్‌తో బయటపడాలని చూశాడు. 2012 నుంచి బ్రిటన్‌లో నివసిస్తున్న బెకర్ మొత్తం ఆరు (వింబుల్డన్ –1985, 1986, 1989; ఆస్ట్రేలియన్ ఓపెన్–1991, 1996; యూఎస్ ఓపెన్–1989) గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించాడు.
NCSC Chairman: ఎన్‌సీఎస్సీ చైర్మన్‌గా రెండోసారి నియమితులైన నేత?
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత ఆర్మీ కొత్త వైస్ చీఫ్‌గా నియామకం
ఎప్పుడు : ఏప్రిల్ 29
ఎవరు : లెఫ్టినెంట్ జనరల్ బగ్గవల్లి సోమశేఖర్ రాజు
ఎందుకు : ఇప్పటివరకు ఆర్మీ వైస్ చీఫ్‌గా ఉన్న లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే ఆర్మీ చీఫ్‌గా నియమితులైన నేపథ్యంలో..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్