NCSC Chairman: ఎన్‌సీఎస్సీ చైర్మన్‌గా రెండోసారి నియమితులైన నేత?
జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్(ఎన్‌సీఎస్సీ) చైర్మన్‌గా బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి విజయ్ సాంప్లా రెండోసారి నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఏప్రిల్ 27న అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. విజయ్ సాంప్లా ఇటీవల పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఎన్‌సీఎస్సీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఆయన గతంలో పంజాబ్‌లోని హోషియార్‌పూర్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఎన్‌సీఎస్సీ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
GK Sports Quiz: FIFA వరల్డ్ కప్ 2022 ను స్పాన్సర్ చేసిన మొదటి భారతీయ కంపెనీ?
పాక్ విదేశాంగ మంత్రిగా ఎవరు ప్రమాణం చేశారు?
పాకిస్తాన్ విదేశాంగ మంత్రిగా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) నేత బిలావల్ భుట్టో జర్దారీ ప్రమాణ స్వీకారం చేశారు. ఏప్రిల్ 27న ఇస్లామాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో బిలావల్‌తో పాకిస్తాన్ అధ్యక్షుడు అరీఫ్ అల్వీ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి షెహజాద్ షరీఫ్, మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ హాజరయ్యారు. అంతర్జాతీయంగా ఇప్పుడు పాకిస్తాన్ ఒంటరవుతోందన్న వాదనల నేపథ్యంలో విదేశాంగ మంత్రిగా ఆయన ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. NASSCOM: నాస్కామ్ చైర్‌పర్సన్‌గా ఎవరు నియమితులయ్యారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్(ఎన్‌సీఎస్సీ) చైర్మన్‌గా నియామకం
ఎప్పుడు : ఏప్రిల్ 27
ఎవరు : బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి విజయ్ సాంప్లా
ఎక్కడ : న్యూఢిల్లీ
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్