NASSCOM: నాస్కామ్ చైర్‌పర్సన్‌గా ఎవరు నియమితులయ్యారు?
నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్, సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్) చైర్‌పర్సన్‌గా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సీనియర్ ఎగ్జిక్యూటివ్ కృష్ణన్ రామానుజం నియమితులయ్యారు. 2022–23 సంవత్సరానికిగాను ఆయన ఈ పదవిలో ఉంటారు. ఇప్పటి వరకు ఆయన నాస్కామ్ వైస్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. టీసీఎస్ ఎంటర్‌ప్రైస్ గ్రోత్ గ్రూప్‌నకు కృష్ణన్ నేతృత్వం వహిస్తున్నారు. నాస్కామ్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
French Presidential Election: ఫ్రాన్స్ అధ్యక్షునిగా వరుసగా రెండోసారి ఎన్నికైన నేత
చంద్రశేఖరన్‌కు మళ్లీ బాధ్యతలు
ప్రయివేట్ రంగ పారిశ్రామిక దిగ్గజం టాటా సన్స్‌కు మరో ఐదేళ్లపాటు ఎన్.చంద్రశేఖరన్ బాధ్యతలు నిర్వహించనున్నారు. చైర్మన్‌గా 2027 ఫిబ్రవరివరకూ కొనసాగేందుకు తాజాగా వాటాదారులు ఆమోదముద్ర వేశారు. టాటా గ్రూప్ కంపెనీలకు హోల్డింగ్ కంపెనీ, ప్రమోటర్ టాటా సన్స్‌కు ఇప్పటికే చంద్రశేఖరన్ నేతృత్వం వహిస్తున్నారు.
2016 నుంచీ కీలక బాధ్యతల్లో..
చంద్రశేఖరన్ 2016 అక్టోబర్‌లో టాటా సన్స్ బోర్డులో చేరారు. 2017 జనవరిలో చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. అదే ఏడాది ఫిబ్రవరి నుంచీ అధికారికంగా నేతృత్వం వహిస్తున్నారు. గ్రూప్‌లోని దిగ్గజాలు టీసీఎస్, టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా పవర్ బోర్డులకు సైతం అధ్యక్షత వహిస్తున్నారు.GK National Quiz: 'భారత్ భాగ్య విధాత' ఉత్సవాల వేదిక?
క్విక్ రివ్యూ :
ఏమిటి : నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్, సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్) చైర్‌పర్సన్‌గా నియామకం
ఎప్పుడు : ఏప్రిల్ 26
ఎవరు : టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సీనియర్ ఎగ్జిక్యూటివ్ కృష్ణన్ రామానుజం
ఎక్కడ : న్యూఢిల్లీ
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్