French Presidential Election: ఫ్రాన్స్ అధ్యక్షునిగా వరుసగా రెండోసారి ఎన్నికైన నేత?
ఫ్రాన్స్ అధ్యక్షునిగా ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (44) వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. దేశ చరిత్రలో ఈ ఘనత సాధించిన మూడో నాయకునిగా నిలిచారు. ఏప్రిల్ 24న జరిగిన ఎన్నికల్లో జాతీయవాదిగా పేరున్న ఫైర్ బ్రాండ్ నాయకురాలు మరీన్ లీ పెన్ (53)పై మాక్రాన్ విజయం సాధించారు. ఇప్పటిదాకా ఐదింట నాలుగొంతుల ఓట్ల లెక్కింపు పూర్తయింది. మాక్రాన్‌కు 56 శాతానికి పైగా ఓట్లు రాగా పెన్ 44 శాతంతో సరిపెట్టుకున్నారు. 2017లో మాక్రాన్ 66 శాతం ఓట్లు సాధించారు.
Niti Aayog: నీతి ఆయోగ్ నూతన వైస్ చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు?
ఫ్రాన్స్..
రాజధాని: పారిస్; కరెన్సీ: యూరో, సీఎఫ్‌పీ ఫ్రాంక్
అధికార భాష: ఫ్రెంచ్
ప్రస్తుత అధ్యక్షుడు: ఇమ్మాన్యుయేల్ మాక్రాన్
ప్రస్తుత ప్రధానమంత్రి: జీన్ కాస్టెక్స్ Telangana: తెలంగాణ కథ వర్తమాన జీవన చిత్రణ పుస్తకాన్ని ఎవరు రచించారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫ్రాన్స్ అధ్యక్షునిగా వరుసగా రెండోసారి ఎన్నికైన నేత?
ఎప్పుడు : ఏప్రిల్ 25
ఎవరు : ఇమ్మాన్యుయేల్ మాక్రాన్
ఎందుకు : ఏప్రిల్ 24న జరిగిన ఎన్నికల్లో జాతీయవాదిగా పేరున్న ఫైర్ బ్రాండ్ నాయకురాలు మరీన్ లీ పెన్‌పై మాక్రాన్ విజయం సాధించడంతో..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్