Canada Parliament Election: కెనడా ప్రధానమంత్రిగా మూడోసారి ఎన్నికైన నేత?
కెనడా పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో... కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మూడోసారి విజయం సాధించారు. రెండేళ్లు ముందుగానే ఎన్నికలకు వెళ్లిన ట్రూడో.. ఈ సారి మెజార్టీ ప్రభుత్వం ఏర్పడితే విధాన పరమైన నిర్ణయాలు స్వేచ్ఛగా తీసుకోవచ్చునని ఆశించారు. కానీ ఇంచుమించుగా 2019 నాటి ఎన్నికల ఫలితాలే పునరావృతమయ్యాయి. 338 స్థానాలున్న కెనడా హౌస్ ఆఫ్ కామన్స్‌లో అధికార లిబరల్ పార్టీ 158 స్థానాలను గెలుచుకోగా, కన్జర్వేటివ్ పార్టీ 119 స్థానాలకు పరిమితమైనట్టుగా ప్రాథమిక ఫలితాలు వెల్లడిస్తున్నాయి. 25 స్థానాలను దక్కించుకున్న న్యూ డెమొక్రాటిక్ పార్టీ మద్దతుతో జస్టిన్ ట్రూడో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. ప్రతిపక్ష కన్జర్వేటివ్ నాయకుడు ఎరిన్ ఒ టూలే తన ఓటమిని అంగీకరించారు.
చదవండి: ఫేస్‌బుక్ ప్రజా విధానాల అధికారిగా నియమితులైన మాజీ ఐఏఎస్?
క్విక్ రివ్యూ :
ఏమిటి : కెనడా ప్రధానమంత్రిగా మూడోసారి ఎన్నికైన నేత?
ఎప్పుడు : సెప్టెంబర్ 22
ఎవరు : కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో
ఎందుకు : కెనడా పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో... అధికార లిబరల్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించినందున...