Hong Kong: హాంకాంగ్ పాలకునిగా ఎవరు ఎన్నికయ్యారు?
హాంకాంగ్ పాలకునిగా(ఛీప్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ హాంకాంగ్) చైనా అనుకూల జాన్ లీ కా–చియు మే 8న ఎన్నికయ్యారు. 1,500 మంది కమిటీ సభ్యుల్లో 1,416 మంది లీకి ఓటేశారు. కమిటీలో మెజారిటీ సభ్యులు చైనా మద్దతుదారులే కావడంతో ఎన్నిక సులభమైంది. ఎన్నికల్లో ఆయన ఒక్కరే పోటీ చేశారు. జూన్ 1న కేరీ లామ్ స్థానంలో లీ బాధ్యతలు చేపడతారు.
హాంకాంగ్ సెక్యూరిటీ చీఫ్‌గా చైనా అండతో నగరంలో ప్రజాస్వామ్య ఉద్యమాన్ని జాన్ లీ కఠినంగా అణచివేశారన్న అపవాదు ఉంది. చైనాకు విధేయులుగా ఉన్నవారే పోటీ చేయగలిగేలా హాంకాంగ్ ఎన్నికల చట్టాల్లో చైనా గతేడాది మార్పులు చేసింది. హాంకాంగ్‌ను పూర్తిగా విలీనం చేసుకొనేందుకు డ్రాగన్ దేశం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.Everest: ఎవరెస్ట్‌ను అత్యధికంగా 26 సార్లు అధిరోహించిన వ్యక్తి?
క్విక్ రివ్యూ :
ఏమిటి : హాంకాంగ్ పాలకునిగా(ఛీప్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ హాంకాంగ్) ఎవరు ఎన్నికయ్యారు?
ఎప్పుడు : మే 08
ఎవరు : జాన్ లీ కా–చియు
ఎక్కడ : హాంకాంగ్
ఎందుకు : తాజా ఎన్నికల్లో విజయం సాధించినందున..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్