Everest: ఎవరెస్ట్‌ను అత్యధికంగా 26 సార్లు అధిరోహించిన వ్యక్తి?
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని నేపాల్‌కు చెందిన షెర్పా కామి రీతా 26 సార్లు అధిరోహించాడు. ఈ క్రమంలో తన రికార్డును తానే బద్దలు కొట్టాడు. 52 ఏళ్ల కామి 10 మందితో కూడిన బృందానికి నేతృత్వం వహిస్తూ మే 7న 26వ సారి ఎవరెస్టును ఎక్కినట్టు సెవన్ సమ్మిట్ ట్రెక్స్ ప్రైవేటు లిమిటెడ్ దావా షెర్పా వెల్లడించారు. 1953లో సర్ ఎడ్మండ్ హిల్లరీ, టెన్సింగ్ నార్కే తొలిసారి వెళ్లిన ఏ మార్గంలోనే కామి బృందం కూడా శిఖరానికి చేరింది.
NITI Aayog: నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
కామి రీతా తొలిసారి 1994లో ఎవరెస్టును అధిరోహించాడు. ప్రపంచంలో రెండో ఎత్తైన మౌంట్ గాడ్విన్ ఆస్టిన్ (కే2)తో పాటు హోత్సే, మనాస్లూ, చో ఓయూ శిఖరాలను కూడా ఆయన ఎక్కాడు. 8 వేల మీటర్ల కంటే ఎత్తైన ఎక్కువ శిఖరాలను అధిరోహించిన రికార్డు కూడా రీతాదే. 8,848.86 మీటర్ల ఎత్తైన ఎవరెస్టును ఎక్కడానికి నేపాల్ పర్యాటక శాఖ 2022 ఏడాది 316 మందికి అనుమతినిచ్చింది. Adviser to PM Modi: ప్రధాని సలహాదారుగా నియమితులైన ఐఏఎస్ అధికారి?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎవరెస్ట్‌ను అత్యధికంగా 26 సార్లు అధిరోహించిన వ్యక్తి?
ఎప్పుడు : మే 07
ఎవరు : నేపాల్‌కు చెందిన షెర్పా కామి రీతా
ఎక్కడ : నేపాల్
ఎందుకు : 52 ఏళ్ల కామి 10 మందితో కూడిన బృందానికి నేతృత్వం వహిస్తూ మే 7న 26వ సారి ఎవరెస్టును ఎక్కినందున..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్