NITI Aayog: నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
నీతి ఆయోగ్ నూతన వైస్ చైర్మన్‌గా సుమన్ బేరీ మే 1న న్యూఢిల్లీలో బాధ్యతలు స్వీకరించారు. పాలసీ ఎకనమిస్ట్, రీసెర్చ్ అడ్మినిస్ట్రేటర్‌గా అపార అనుభవమున్న ఆయన గతంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్‌లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్‌గా వ్యవహరించారు. ప్రధాని ఆర్థిక సలహా మండలి, స్టాటిస్టికల్ కమిషన్ సభ్యుడిగా, ఆర్‌బీఐ మానిటరీ పాలసీ సాంకేతిక సలహా కమిటీ సభ్యునిగా చేశారు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ పదవికి రాజీవ్ కుమార్ అకస్మాత్తుగా రాజీనామా చేశారు. దీంతో కొత్త వైస్ చైర్మన్‌గా సుమన్ బెరీని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నీతి ఆయోగ్ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
Pink Lady: ఏ దేశానికి చెందిన న్యూస్ రీడర్ పింక్ లేడీగా పేరొందారు? GK Science & Technology Quiz: బ్రహ్మపుత్ర నదిలో ప్రయాణించిన అతి పొడవైన కార్గో నౌక?
క్విక్ రివ్యూ :
ఏమిటి : నీతి ఆయోగ్ నూతన వైస్ చైర్మన్‌గా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : మే 1
ఎవరు : సుమన్ బేరీ
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : ఇప్పటివరకు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా ఉన్న రాజీవ్ కుమార్ తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్