Adviser to PM Modi: ప్రధాని సలహాదారుగా నియమితులైన ఐఏఎస్ అధికారి?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సలహాదారుగా పెట్రోలియం శాఖ మాజీ కార్యదర్శి తరుణ్ కపూర్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ మే 2న ఉత్తర్వులు జారీ చేసింది. 1987 ఐఏఎస్ బ్యాచ్ (హిమాచల్‌ప్రదేశ్ కేడర్) అధికారి అయిన కపూర్.. పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వశాఖ కార్యదర్శిగా 2021, నవంబరు 30న పదవీ విరమణ చేశారు. మరోవైపు 1994వ బ్యాచ్ ఐఏఎస్ అధికారులు హరిరంజన్ రావు, అతీశ్ చంద్ర పీఎంవోలో అదనపు కార్యదర్శులుగా నియమితులయ్యారు.
పాకిస్తాన్‌కు రూ.61వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన దేశం?
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్తాన్‌కు సౌదీ అరేబియా రూ.61వేల కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించింది. పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ బృందం ఇటీవల సౌదీ వెళ్లి జరిపిన చర్చల్లో ఈ మేరకు అంగీకారం కుదిరినట్లు ‘ది న్యూస్’ వెల్లడించింది.NITI Aayog: నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సలహాదారుగా నియామకం
ఎప్పుడు : మే 02
ఎవరు : కేంద్ర పెట్రోలియం శాఖ మాజీ కార్యదర్శి తరుణ్ కపూర్
ఎందుకు : కేంద్ర ప్రభుత్వ మేరకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్