Vizag Steel Plant: వైజాగ్ స్టీల్‌ప్లాంట్ సీఎండీగా ఎవరు నియమితులయ్యారు?
ఇంతకుముందు సీఎండీగా బాధ్యతలు నిర్వహించిన పి.కె.రథ్ 2021, మే 31న పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత అప్పటి డైరెక్టర్ (పర్సనల్) కె.సి.దాస్ ఇన్‌చార్జి సీఎండీగా బాధ్యతలు చేపట్టారు. ఆయన జూన్ 30న పదవీ విరమణ చేయడంతో ప్రస్తుత డైరెక్టర్ (కమర్షియల్) డి.కె.మహంతి ఇన్‌చార్జ్ సీఎండీ బాధ్యతలు చేపట్టి ఇప్పటి వరకు కొనసాగుతున్నారు.
రాజీనామాకు సిద్ధమైన జపాన్ ప్రధాని సుగా...
కోవిడ్–19 మహమ్మారిని ఎదుర్కోవడంలో విఫలమయ్యారంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న జపాన్ ప్రధాని యోషిహిడే సుగా(72) పదవి నుంచి వైదొలిగేందుకు సిద్ధమయ్యారు. పార్టీ నాయకుడిని ఎన్నుకునేందుకు ఈ నెలాఖరులో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. 2020, సెప్టెంబర్‌లో ప్రధాని షింజో అబే అనారోగ్య కారణాలతో పదవి నుంచి వైదొలగగా సుగా బాధ్యతలు చేపట్టారు. పార్లమెంట్‌లో అధికార పార్టీకి పూర్తి స్థాయిలో బలముంది. పార్టీకి ఎన్నికయ్యే కొత్త నాయకుడే ప్రధానిగా బాధ్యతలు చేపడతారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వైజాగ్ స్టీల్‌ప్లాంట్ సీఎండీగా నియామకం
ఎప్పుడు : సెప్టెంబర్ 2
ఎవరు : అతుల్ భట్
ఎందుకు : ప్రభుత్వ నిర్ణయం మేరకు...