Skip to main content

CBI: ఎన్‌ఎస్‌ఈ మాజీ చీఫ్‌ చిత్రా రామకృష్ణను ఏ కేసులో అరెస్ట్‌ చేశారు?

Chitra Ramkrishna

కొ–లొకేషన్‌ కేసు(co-location)లో నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఎన్‌ఎస్‌ఈ) మాజీ సీఈవో చిత్రా రామకృష్ణను సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(సీబీఐ) మార్చి 6న అరెస్ట్‌ చేసింది. ఢిల్లీలో ఆమెను అరెస్ట్‌ చేసిన అధికారులు అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి, సీబీఐ ప్రధాన కార్యాలయం(న్యూఢిల్లీ) లాకప్‌లో ఉంచారు. ఎన్‌ఎస్‌ఈ కొ–లొకేషన్‌ కేసుకు సంబంధించి సీబీఐ 2018 నుంచి దర్యాప్తు చేస్తోంది. ఎన్‌ఎస్‌ఈ చీఫ్‌గా చిత్రా రామకృష్ణ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా(సెబీ–ఎస్‌ఈబీఐ) నివేదిక ఇటీవలే తేల్చడం ఈ కేసులో కీలక మలుపుగా భావించొచ్చు. ఒక అదృశ్య యోగితో ఆమె ఎన్‌ఎస్‌ఈకి సంబంధించి కీలక విధాన నిర్ణయాలను పంచుకోవడం, ఆమె నిర్ణయాల్లో యోగి పాత్ర ఉండడం బయటకొచ్చింది. ఇదే కేసులో ఎన్‌ఎస్‌ఈ గ్రూపు మాజీ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ ఆనంద్‌ సుబ్రమణియన్‌ను 2022, ఫిబ్రవరి 25న సీబీఐ అరెస్ట్‌ చేసింది. ముంబై నగరంలో ఎన్‌ఎస్‌ఈ ఉంది. 

చ‌ద‌వండి: చెన్నై మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన తొలి దళిత మహిళ?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
అరెస్ట్‌ అయిన నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(ఎన్‌ఎస్‌ఈ) మాజీ సీఈవో? 
ఎప్పుడు : మార్చి 6
ఎవరు    : చిత్రా రామకృష్ణ
ఎక్కడ    : న్యూఢిల్లీ
ఎందుకు : ఎన్‌ఎస్‌ఈ కొ–లొకేషన్‌ కేసు(co-location)కు సంబంధించి..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 07 Mar 2022 05:31PM

Photo Stories