Elon Musk: ప్రపంచ కుబేరుల్లో మొదటి స్థానం కోల్పోయిన మస్క్
Sakshi Education
ఫ్రెంచ్ లగ్జరీ ఉత్పత్తుల సంస్థ ఎల్వీఎంహెచ్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ బెర్నార్డ్ అర్నాల్ట్ నికర సంపద 190.90 బి.డాలర్లకు చేరడంతో, రియల్-టైమ్ బిలియనీర్ల జాబితాలో ఆయన అగ్ర స్థానం దక్కించుకున్నట్లు తాజాగా ఫోర్బ్స్ తెలిపింది.
దీంతో విద్యుత్ కార్ల తయారీ సంస్థ టెస్లా, స్సేస్ ఎక్స్-ట్విటర్ సీఈఓ ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుల జాబితాలో అగ్రస్థానాన్ని కోల్పోయాడు. 133.70 బి.డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల జాబితా మూడో స్థానంలో భారత వ్యాపారవేత్త గౌతమ్ అదానీ కొనసాగుతున్నారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ల ఇండెక్స్ ప్రకారం–బెర్నార్డ్ అర్నాల్ట్ ఆస్తులు 172.9 బిలియన్ల డాలర్లు కాగా, మస్క్ ఆస్తుల విలువ 168.5 బిలియన్ల డాలర్లుగా ఉంది.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (03-09 డిసెంబర్ 2022)
Published date : 23 Dec 2022 04:23PM