Skip to main content

Elon Musk: ట్విట్టర్‌ సీఈవోగా మస్క్ తప్పుకోవాలని 57.5 శాతం ఓట్లు

సామాజిక దిగ్గజ సంస్థ ట్విట్టర్‌కు సారథ్య బాధ్యతలు నిర్వర్తించడంలో విఫలమయ్యాడంటూ సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న ఆ సంస్థ సీఈవో, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు మరో ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది.
Elon Musk

మస్క్‌ అధికారిక ట్విట్టర్‌ ఖాతాకు ప్రపంచవ్యాప్తంగా 12.2 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. వీరిని ఉద్దేశిస్తూ మస్క్ డిసెంబ‌ర్ 19న‌ ఒక ట్వీట్‌చేశారు. ‘ట్విట్టర్‌కు సీఈవోగా నేను తప్పుకోవాలా?. ఈ పోలింగ్‌లో వచ్చే ఫలితాలకు అనుగుణంగా నడుచుకుంటా. మీ నిర్ణయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. మీరేం ఆశిస్తారో అదే మీకు దక్కుతుంది’ అని మస్క్ ట్వీట్ పేర్కొన్నారు. దీనిపై ట్విటర్‌ యూజర్లు వెంటనే భారీగా స్పందించారు. పోలైన ఓట్లలో 57.5 శాతం ఓట్లు మస్క్‌కు వ్యతిరేకంగా పడ్డాయి. మాకు మీరు అక్కర్లేదంటూ ‘యస్‌’ చెబుతూ ఓట్లు వేశారు. మస్క్‌ పిలుపునకు స్పందనగా 1.7 కోట్లకుపైగా ఓట్లు పోల్‌ అయ్యాయని సీఎన్‌ఎన్‌ పేర్కొంది. దాదాపు 44 బిలియన్‌ డాలర్ల పెట్టుబడితో ట్విటర్‌ను హస్తగతం చేసుకున్నాక మస్క్‌ తీసుకున్న కఠిన నిర్ణయాలపై విమర్శలు కొనసాగుతోంది.   

వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (11-17 నవంబర్ 2022)

Published date : 20 Dec 2022 12:57PM

Photo Stories