Skip to main content

Mount Vinson: విన్సన్‌ పర్వతంపై భారత జెండా రెపరెపలు

తెలంగాణ‌లోని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన పడమటి అన్వితారెడ్డి అంటార్కిటికాలోని విన్సన్‌ పర్వతాన్ని అధిరోహించారు.
Anvitha Reddy

డిసెంబ‌ర్‌ 2న హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన ఆమె అంటార్కిటికా చేరుకుని అక్కడ నుంచి 8న బేస్‌ క్యాంప్‌కు చేరుకున్నారు. మైనస్‌ 25 నుంచి మైనస్‌ 30 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న 4,892 మీటర్ల ఎత్తయిన విన్సన్‌ పర్వతాన్ని డిసెంబ‌ర్‌ 16వ తేదీన ఉదయం అధిరోహించి భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అన్వితారెడ్డి సెప్టెంబర్‌ 28న నేపాల్‌లోని మనాస్లు పర్వతాన్ని అధిరోహించిన మొదటి భారత మహిళగా ఇప్పటికే చరిత్ర సృష్టించారు. అలాగే 2021 మేలో ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్టు పర్వతం, జనవరి 21న దక్షిణాఫ్రికాలోని కిలిమంజారో, డిసెంబర్‌ 7న యూరప్‌లోని ఎల్‌బ్రోస్‌ పర్వతాలను ఎక్కారు.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (వ్యక్తులు) క్విజ్ (11-17 నవంబర్ 2022)

Published date : 20 Dec 2022 05:11PM

Photo Stories