Skip to main content

Women Reaches South Pole: ఒం‍టరిగా దక్షిణ ధ్రువంపైకి చేరుకొని రికార్డు సాధించిన మహిళ.. ఇది మూడో రికార్డు..

మూడోసారి రికార్డు సాధించి తన ఖాతాలో వేసుకున్న బ్రిటీష్‌ సిక్కు మహిళ. తన ‍ప్రయాణాన్ని ప్రారంభించి అనుకున్న లక్ష‍్యానికి చేరుకుంది. పూర్తి వివరాలను చదవండి..
Record-breaking feat for British Sikh woman  British Sikh woman breaking records on her journey  Harpreet Chandi.. a sikh women creates another record through her trekking

అంటార్కిటికా అన్వేషణలతో పోలార్‌ ప్రీత్‌గా పేరు తెచ్చుకున్న బ్రిటిష్‌ సిక్కు ఆర్మీ అధికారి, ఫిజియోథెరపిస్ట్‌ కెప్టెన్‌ హర్‌ప్రీత్‌ చాంది(33) మరో ప్రపంచ రికార్డు నెలకొల్పారు. దక్షిణ ధ్రువంపై ఒంటరిగా వేగవంతంగా అన్వేషణ పూర్తి చేసుకున్న మహిళగా తాజాగా చరిత్ర సృష్టించారు. రోన్నె ఐస్‌ షెల్ఫ్‌ నుంచి నవంబర్‌ 26న ప్రారంభించిన యాత్ర దక్షిణ ధ్రువానికి చేరుకోవడం గురువారంతో ముగిసినట్లు ఆమె స్వయంగా ప్రకటించారు.

Queen Margrethe II: పదవీ విరమణ చేయనున్న డెన్మార్క్ రాణి మార్గరేట్-II

రోజుకు 12 ,13 గంటల చొప్పున ముందుకు సాగుతూ మైనస్‌ 50 డిగ్రీల ఉష్ణోగ్రతల వద్ద మొత్తం 1,130 కిలోమీటర్ల దూరాన్ని ఎవరి సాయం లేకుండానే 31 రోజుల 13 గంటల 19 నిమిషాల్లో పూర్తి చేశానన్నారు. ఈ ఫీట్‌ను గురించి గిన్నిస్‌ వరల్డ్‌ బుక్‌ నిర్వాహకులకు వివరాలందించానని, ధ్రువీకరణ కోసం వేచి చూస్తున్నానని చెప్పారు. అంటార్కిటికా అన్వేషణలకు సంబంధించి కెప్టెన్‌ హర్‌ప్రీత్‌ చాంది పేరిట ఇప్పటికే రెండు వేర్వేరు రికార్డులు నమోదై ఉన్నాయి.

Published date : 03 Jan 2024 09:21AM

Photo Stories