Skip to main content

Anantapur Mayor: అనంతపురం మేయర్‌కు అరుదైన గౌరవం

అనంతపురం మేయర్‌కు అరుదైన గౌరవం లభించింది.
Anantapur Municipal Corporation Mayor Mohammad Wasim Salim  Anantapur Mayor attends international conference in Kazan, Russia

అనంతపురం కార్పొరేషన్‌: అనంతపురం నగరపాలక సంస్థ మేయర్‌ మహమ్మద్‌ వసీం సలీంకు అరుదైన గౌరవం దక్కింది. జూన్ 21వ తేదీ రష్యాలోని కజాన్‌ నగరంలో బ్రిక్స్‌ దేశాల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగే మేయర్ల సదస్సుకు ఆహ్వానం అందింది. ఈ సదస్సులో వివిధ దేశాల నుంచి 50 మందికి పైగా మేయర్లు పాల్గొననున్నారు. 
భారత్‌ నుంచి ఐదుగురు మేయర్లకు ఆహ్వానం అందగా.. అందులో అనంతపురం మేయర్‌ ఒకరు. మిగిలిన వారిలో జైపూర్, క్యాలికట్, త్రిసూర్, నాగర్‌ కోయిల్‌ మేయర్లు ఉన్నారు. 

అనంతపురం మేయర్‌కే ఎందుకంటే.. 
అనంతపురానికి రష్యాకు చారిత్రక సంబంధం ఉంది. 550 ఏళ్ల కిందట రష్యన్‌ యాత్రికుడు అఫానసీ నికితిన్‌ విజయనగర సామ్రాజ్యంలో భాగమైనటువంటి అనంతపురాన్ని సందర్శించాడు. 
ఆ అంశాలు ఇటీవల కజాన్‌లో జరిగిన అసోసియేషన్‌ వ్యవస్థాపక సమావేశంలో చర్చకు వచ్చి.. అనంతపురం ప్రాధాన్యతను గుర్తు చేశాయి.

 

Indian Army New Chief: భారత నూతన సైన్యాధిపతి ఈయ‌నే..

Published date : 19 Jun 2024 08:51AM

Photo Stories