Indian Army New Chief: భారత నూతన సైన్యాధిపతిగా జనరల్ ఉపేంద్ర ద్వివేది
ప్రస్తుతం ఆర్మీ వైస్‌చీఫ్‌గా పనిచేస్తున్న ద్వివేది జూన్ 30వ తేదీన బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
➤ 1964 జులై 1న జన్మించిన ద్వివేది 1984 డిసెంబర్ 15న జమ్మూ-కశ్మీర్ రైఫిల్స్ దళంలో చేరారు. 40 ఏళ్ల సైనిక సేవలో అనేక స్థాయిల్లో బాధ్యతలు నిర్వహించారు.
➤ ఇందులో జమ్మూ కశ్మీర్ 18 రైఫిల్స్ రెజ్మింట్ కమాండ్, అసోం రైఫిల్స్ బ్రిగేడ్, డీఐజీ, 9 కార్ప్స్ డీఐజీగా ఆయన విధులు నిర్వర్తించారు.
➤ 2022 నుంచి 2024 వరకు నార్తర్న్ కమాండ్‌కు డైరెక్టర్ జనరల్ ఇన్ ఫ్రాంట్రీ, జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ పదవులను నిర్వహించారు.
➤ ఆయన సేవలకు గుర్తుగా పరమ విశిష్ట సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకంతో సహా అనేక పురస్కారాలు అందుకున్నారు.
➤ ప్రస్తుతం సైన్యాధిపతిగా ఉన్న జనరల్ మనోజ్ సి పాండే పదవీ విరమణ చేయనున్నారు.
Cabinet Ministers: మోదీ 3.0 టీమ్.. కేంద్ర కేబినేట్‌లో 72 మంది మంత్రులు వీరే..