Skip to main content

Amritpal Singh: అమృత్‌పాల్‌ సింగ్‌ విదేశీ నిధులపై ఆరా.. భార్య కిరణ్‌దీప్‌ కౌర్‌ను ప్రశ్నించిన పోలీసులు!

ఖలీస్తాన్‌ వేర్పాటువాద నాయకుడు అమృత్‌పాల్‌ సింగ్‌ పోలీసుల కన్నుగప్పి తప్పించుకొని తిరుగుతున్న నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యుల్ని పంజాబ్‌ పోలీసులు ప్రశ్నించారు.
Amritpal Singh with NRI wife Kirandeep

అమృత్‌పాల్‌ సింగ్‌ భార్య కిరణ్‌దీప్‌ కౌర్, ఆయన తండ్రి తర్సేమ్‌ సింగ్, తల్లిని మార్చి 22న‌ పోలీసులు విచారించారు. అమృత్‌పాల్‌కు అందుతున్న విదేశీ నిధులపై ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. 
ఎవరీ కిరణ్‌ దీప్‌ ?  
యూకేలో ఎన్నారై అయిన కిరణ్‌ దీప్‌ కౌర్‌ను ఈ ఏడాది ఫిబ్రవరిలో అమృత్‌పాల్ పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన వెంటనే పంజాబ్‌కు వచ్చిన కిరణ్‌దీప్‌ ప్రస్తుతం తమ పూర్వీకుల గ్రామం జల్లూపూర్‌ ఖేదాలో ఉంటున్నారు. పంజాబ్‌లోని జలంధర్‌ ఆమె స్వగ్రామం. వారిస్‌ పంజాబ్‌ దే వారిస్‌ సంస్థ బాధ్యతల్ని అమృత్‌పాల్‌ తీసుకున్న కొద్ది నెలలకే కిరణ్‌దీప్‌ను వివాహం చేసుకున్నారు. రివర్స్‌ మైగ్రేషన్‌ జరగాలని, వివిధ దేశాల్లో భారతీయుల్ని తిరిగి మాతృదేశానికి రప్పించడమే తన ధ్యేయమని, అందుకే ఎన్నారైని పెళ్లి చేసుకున్నానని అమృత్‌పాల్‌ అప్పట్లో చెప్పారు. అమృత్‌పాల్‌ సింగ్, కిరణ్‌దీప్, ఇతర కుటుంబ సభ్యుల బ్యాంక్‌ అకౌంట్లను పోలీసులు ఇప్పుడు తరచి చూస్తున్నారు. ఆ అకౌంట్లలోకి డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయో ఆరా తీస్తున్నారు.  


రూ.35 కోట్ల విదేశీ నిధులు 
అమృత్‌పాల్‌కు విదేశాల నుంచి వివిధ మార్గాల ద్వారా  దాదాపుగా రూ.35 కోట్లు అందినట్టుగా ఆయన అనుచరుడు దిల్‌జిత్‌ కల్సిని విచారించగా వెల్లడైంది. ఆ డబ్బులతోనే తనకు, తన అనుచరులకు అమృత్‌పాల్‌ వాహనాలు కొన్నాడు. అక్రమ ఆయుధాలతో పాటు 35 బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు కొన్నారు. పాకిస్తాన్‌ ఐఎస్‌ఐతో కూడా అమృత్‌పాల్‌కు సంబంధాలున్నట్టు పోలీసులు చెబుతున్నారు.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (19-25 ఫిబ్రవరి 2023)

Published date : 23 Mar 2023 05:12PM

Photo Stories