Highest Districts: దేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధిక జిల్లాలు ఉన్నాయి.. అవి ఎన్ని?
దేశంలోని వివిధ ప్రాంతాల వివరాలు తెలుసుకోవడం ఎవరికైనా తప్పనిసరి. అందుకే మన దేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధిక జిల్లాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
భారతదేశంలో వైశాల్యం పరంగా రాజస్థాన్‌ను అతిపెద్ద రాష్ట్రంగా పరిగణిస్తారు. జనాభా కోణంలో చూస్తే ఈ టైటిల్ ఉత్తరప్రదేశ్‌కు దక్కుతుంది. అయితే మన దేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధిక జిల్లాలు ఉన్నాయి? అవి ఎన్ని? అనే విషయాన్ని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అందుకే ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
భారతదేశంలో అత్యధిక జిల్లాలు కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఈ రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 75. ఇవి 2,40,928 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. ఈ జిల్లాలను 18 డివిజన్లుగా విభజించారు. రాష్ట్రంలో 17 మున్సిపల్ కార్పొరేషన్లు, 822 కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాకులు, 350 తహసీల్‌లు కూడా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని అతిపెద్ద జిల్లా లఖింపూర్ ఖేరీ. ఇది దాదాపు 10.1 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. లఖింపూర్ ఖేరీ పొరుగు దేశం నేపాల్‌తో సరిహద్దును పంచుకుంటుంది. ఈ జిల్లాలో గోమతి, శారద, కథన తదితర నదులు ప్రవహిస్తున్నాయి. యూపీలోని అతి చిన్న జిల్లా హాపూర్.
భారతదేశంలో అత్యధిక సంఖ్యలో జిల్లాలు కలిగిన రెండవ రాష్ట్రం మధ్యప్రదేశ్. ఈ రాష్ట్రంలో మొత్తం 52 జిల్లాలు ఉన్నాయి. రాష్ట్రంలో అతిపెద్ద జిల్లా చింద్వారా. ఈ జాబితాలో మూడవ స్థానంలో బీహార్ ఉంది. ఈ రాష్ట్రంలో మొత్తం 38 జిల్లాలున్నాయి. 101 సబ్ డివిజన్లు, 534 సిడి బ్లాక్‌లు ఉన్నాయి. బీహార్‌లోని అతిపెద్ద జిల్లా పట్నా. ఇది బీహార్ రాజధాని. పట్నా పలు ప్రత్యేకతలు కలిగిన ప్రాంతం.