World's Largest Office: ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయం... ఎక్కడుందో తెలుసా... దీని ఖరీదు ఎంతంటే...
ప్రపంచ వజ్రాల రాజధానిగా గుజరాత్‌లోని సూరత్ గుర్తింపు పొందింది. ఇక్కడి నుంచి ప్రపంచంలోని అనేక దేశాలకు, ప్రాంతాలకు డైమండ్స్ ఎగుమతి అవుతుంటాయి. ప్రపంచంలోని 90 శాతం వజ్రాలు సూరత్‌లోనే తయారవుతాయంటే వజ్రాలకు సూరత్ ఎంత ఫేమసో అర్థమవుతోంది కదా.
C R Rao: భారతీయ అమెరికన్‌కు నోబెల్‌తో సమానమైన అంతర్జాతీయ అవార్డు... ఎవరీ సీఆర్ రావు.. స్టాటిస్టిక్స్‌లో ఆయన సాధించిన ఘనతలేంటి..?
డైమండ్స్ అంటేనే ఖరీదుతో కూడుకున్నవి. కాబట్టి వీటిని కొనేవారు కూడా ధనవంతులే. సో ప్రపంచ నలుమూలల నుంచి డైమండ్స్‌ను కొనడానికి వ్యాపారులు ఇక్కడకు వస్తుంటారు. వ్యాపారం సులువుగా సాగేందుకు ‘సూరత్ డైమండ్ బోర్స్’ (ఎస్‌డీబీ) సంస్థ ఒక పెద్ద కార్యాలయాన్ని నిర్మించాలని అనుకుంది.
నాలుగేళ్లకింద భవన నిర్మాణపనులు ప్రారంభించింది. ఇప్పటికి పూర్తయింది ఈ భవనం. ఈ నవంబరులో ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని ప్రారంభించనున్నారు. భారతీయ ఆర్కిటెక్చర్ సంస్థ మోర్ఫోజెనిసిస్ ఈ భవనాన్ని రూపొందించింది. 65,000 మంది ఇక్కడ వ్యాపారం చేసుకునేందుకు వీలుగా 35 ఎకరాల్లో, 15 అంతస్తుల భవనాలతో దీన్ని నిర్మించారు. నిర్మాణానికి ముందే ఇందులో అన్ని కార్యాలయాలను డైమండ్ కంపెనీలు కొనుగోలు చేశాయని ఎస్‌డీబీ తెలిపింది.
Inspirational Story: కూలీనాలీ చేసుకుంటూ చదువుకున్నా.. ఇప్పుడు గర్వంగా పీహెచ్‌డీ సాధించా... ఈ చదువుల తల్లికి సలాం కొట్టాల్సిందే
ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.3,200 కోట్లు ఖర్చయ్యాయి. అత్యాధునిక సౌకర్యాలు, విశాలమై కారిడార్లు, ఇంటీరియర్, మార్బుల్ ఫ్లోరింగ్‌తో ఈ భవనాన్ని అద్భుతంగా నిర్మించారు. డైమండ్ మైనింగ్, క్యూరేషన్ కంపెనీలకు చెందిన ఉద్యోగులకు ఆతిథ్యం ఇవ్వనుంది.