Birsa Munda: జన జాతీయ గౌరవ్ దివస్‌గా ఏ రోజును ప్రకటించనున్నారు?
బ్రిటిష్ వలసవాదం, దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించిన గిరిజన యోధుడు బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల స్మారకార్థం నవంబర్ 15వ తేదీని జన జాతీయ గౌరవ్ దివస్‌గా ప్రకటించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. గిరిజనుల విజయాలు, సంస్కృతిని స్మరించుకుంటూ ప్రతిఏటా నవంబర్ 15 నుంచి వారం రోజులపాటు వేడుకలు నిర్వహించనుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన నవంబర్ 10న సమావేశమైన కేబినెట్ ఈ మేరకు నిర్ణయించింది. అలాగే పెట్రోల్‌లో కలపడానికి చెరకు నుంచి ఉత్పత్తి చేసే ఇథనాల్‌పై లీటర్‌కు రూ.1.47 చొప్పున ధరను పెంచేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
రుణాలు తీర్చడానికి రూ.17,408 కోట్లు..
2014–15 నుంచి 2020–21 వరకూ ఏడు పత్తి సీజన్లలో రైతుల నుంచి పత్తి కొనుగోలు కోసం బ్యాంకుల నుంచి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడానికి రూ.17,408.85 కోట్లు ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సీసీఈఏ) అంగీకారం తెలిపింది. ఆహార ధాన్యాలు వందశాతం, చక్కెరను 20 శాతం జనపనార సంచుల్లో ప్యాకేజింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
చదవండి: ఎంపీల్యాడ్స్ పథక పునరుద్ధరణకు కేబినెట్ ఆమోదం
క్విక్ రివ్యూ :
ఏమిటి : గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల స్మారకార్థం నవంబర్ 15వ తేదీని జన జాతీయ గౌరవ్ దివస్‌గా ప్రకటించాలని నిర్ణయం
ఎప్పుడు : నవంబర్ 10
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : బ్రిటిష్ వలసవాదం, దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించిన గిరిజన యోధుడు బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్