Union Cabinet: ఎంపీల్యాడ్స్ పథక పునరుద్ధరణకు కేబినెట్ ఆమోదం
కోవిడ్–19 మహమ్మారి ఉధృతి కారణంగా నిలిచిపోయిన పార్లమెంట్ సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి (ఎంపీల్యాడ్స్) పథకాన్ని పునరుద్ధరించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన నవంబర్ 10న సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
15వ ఆర్థిక సంఘం కాలపరిమితి వరకూ..
15వ ఆర్థిక సంఘం కాలపరిమితి వరకూ ఎంపీల్యాడ్స్ పునరుద్ధరణ, కొనసాగింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అభివృద్ధి పనుల నిమిత్తం 2021–22లో మిగిలిన కాలానికి గానూ ప్రతి పార్లమెంట్ సభ్యుడికి రూ.2 కోట్లు ఒకే విడతలో, 2022–23 నుంచి 2025–26 వరకూ ఏటా రూ.5 కోట్ల నిధులను రెండు విడతల్లో కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేయనుంది. 2025–26 దాకా ఎంపీల్యాడ్స్‌కు కేంద్ర సర్కారు రూ.17,417 కోట్లు వెచ్చించనుంది. కోవిడ్–19 వైరస్ వ్యాప్తి కారణంగా ఎంపీల్యాడ్స్ పథకాన్ని 2020 ఏప్రిల్‌లో తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే.
చదవండి: యునెస్కో సృజనాత్మక నగరాల్లో చోటు దక్కించుకున్న నగరం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : పార్లమెంట్ సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి (ఎంపీల్యాడ్స్) పథకాన్ని పునరుద్ధరించాలని నిర్ణయం
ఎప్పుడు : నవంబర్ 10
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : పార్లమెంట్ స్థానాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్