Skip to main content

UNESCO: యునెస్కో సృజనాత్మక నగరాల్లో చోటు దక్కించుకున్న నగరం?

Srinagar

ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ(యునైటెడ్‌ నేషన్స్‌ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్‌ అండ్‌ కల్చరల్‌ ఆర్గనైజేషన్‌–UNESCO) సృజనాత్మక నగరాల నెట్‌వర్క్‌లో భారతీయ నగరం శ్రీనగర్‌కు చోటు దక్కింది. ప్రపంచంలో ఇలాంటి 49 నగరాలను దీనిలో కొత్తగా చేర్చారు. దీంతో 90 దేశాల్లో సృజనాత్మక నగరాల సంఖ్య 295కి చేరింది. జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌తో పాటు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ను జాబితాలో చేర్చాలని యునెస్కోకు భారత్‌ గతంలో సిఫార్సు చేసింది. దీనిలో శ్రీనగర్‌కే అవకాశం దక్కింది. ముంబై, హైదరాబాద్‌లను 2019లో ఈ జాబితాలో చేర్చారు.
 

చ‌ద‌వండి: లఖిమ్‌పూర్‌ ఖేరి ఘటన పర్యవేక్షణకు మరో కమిషన్‌: సుప్రీంకోర్టు

క్విక్‌ రివ్యూ :
ఏమిటి    :
యునెస్కో సృజనాత్మక నగరాల నెట్‌వర్క్‌లో చోటు దక్కించుకున్న నగరం?
ఎప్పుడు : నవంబర్‌ 8
ఎవరు    : శ్రీనగర్‌ 
ఎందుకు : భారత ప్రభుత్వం సిఫార్సుల మేరకు...

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 09 Nov 2021 04:32PM

Photo Stories