Union Cabinet: పీఎంజీఎస్‌వై పథకాన్ని ఎప్పటి వరకు కొనసాగించనున్నారు?
ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) పథకం ఫేజ్ 1, 2 లను సెప్టెంబరు, 2022 వరకూ కొనసాగించనున్నారు. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిపాదనలను కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నవంబర్ 17న ఆమోదం తెలిపింది. ఈ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. మైదాన ప్రాంతాల్లో 500 పైగా, ఈశాన్య, పర్వత ప్రాంతాల్లో 250పైగా జనాభా ఉన్న గ్రామాలకు రహదారుల అనుసంధానం నిమిత్తం కేంద్రం పీఎంజీఎస్‌వైను ప్రారంభించింది.
మంత్రి అనురాగ్ తెలిపిన వివరాల ప్రకారం...
- రూ.33,822 కోట్లతో గిరిజన, మారుమూల ప్రాంతాల్లో 32,152 కి.మీ.ల మేర రహదారులను అభివృద్ధి చేయనున్నారు. రూ.33,822 కోట్లలో కేంద్ర వాటా రూ.22,978 కోట్లుగా ఉంది.
- వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలకు రహదారుల అనుసంధానం (ఆర్‌సీపీఎల్‌డబ్ల్యూఏ) ద్వారా 9 రాష్ట్రాల్లోని 44 జిల్లాల్లో 4,490 కిలోమీటర్ల మేర రహదారిలో 105 వంతెనలు ఇప్పటికే పూర్తయ్యాయి.
- 5,714 కిలోమీటర్ల రహదారి, 358 వంతెనలు పూర్తి కావాల్సి ఉండగా మరో 1,887 కిలోమీటర్ల రహదారి, 40 వంతెనల నిర్మాణాలకు అనుమతులు వచ్చాయి.
చదవండి: కర్తార్‌పూర్ సాహిబ్ గురుద్వారా ఏ నది ఓడ్డున ఉంది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) పథకం ఫేజ్ 1, 2 లను సెప్టెంబరు, 2022 వరకూ కొనసాగించాలని నిర్ణయం
ఎప్పుడు : నవంబర్ 17
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : మైదాన ప్రాంతాల్లో 500 పైగా, ఈశాన్య, పర్వత ప్రాంతాల్లో 250పైగా జనాభా ఉన్న గ్రామాలకు రహదారుల అనుసంధానం నిమిత్తం..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్