Skip to main content

Kartarpur Corridor: కర్తార్‌పూర్‌ సాహిబ్‌ గురుద్వారా ఏ నది ఓడ్డున ఉంది?

Kartarpur

సిక్కుల పవిత్ర యాత్రా స్థలాలైన పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్‌ సాహిబ్‌ గురుద్వారా, భారత్‌లోని గురుదాస్‌పూర్‌ డేరాబాబా నానక్‌ గురుద్వారాను  కలిపే కర్తార్‌పూర్‌ సాహిబ్‌ కారిడార్‌ను 2021, నవంబర్‌ 17వ తేదీ నుంచి తెరవనున్నారు. ఈ విషయాన్ని భారత హోం మంత్రి అమిత్‌ షా నవంబర్‌ 16న తెలిపారు. నవంబర్‌ 19వ తేదీ నుంచి గురునానక్‌ జయంతి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 2020 మార్చిలో ఈ కారిడార్‌ను మూసివేసింది.

రావి నది ఓడ్డున...

సిక్కు మత వ్యవస్థాపకుడు బాబా గురునానక్‌ 550వ జయంతి 2019, నవంబర్‌ 12న ఉన్న నేపథ్యంలో... 2019, నవంబర్‌ 9న కర్తార్‌పూర్‌ కారిడార్‌ను ప్రారంభించారు. ఈ కారిడార్‌ ద్వారా భారత్‌లోని సిక్కు మతస్తులు పాకిస్తాన్‌లో ప్రార్థనా స్థలాలను సందర్శించేందుకు వీలు కలిగింది. 4.5 కిలోమీటర్ల ఈ కారిడార్‌ ద్వారా భారత యాత్రికులు వీసా లేకుండా పాకిస్తాన్‌లోని రావి నది ఓడ్డున ఉన్న కర్తార్‌పూర్‌ సాహిబ్‌ను దర్శించుకోవచ్చు.

 

గుర్దాస్‌పూర్‌ జిల్లాలో...

భారత్‌లోని పంజాబ్‌ రాష్ట్రం, గుర్దాస్‌పూర్‌ జిల్లాలోని డేరాబాబా నానక్‌ పట్టణంలో గురుదాస్‌పూర్‌ డేరాబాబా నానక్‌ గురుద్వారా ఉంది. పాకిస్తాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్, నరోవల్‌ జిల్లాలోని కర్తార్‌పూర్‌ పట్టణంలో కర్తార్‌పూర్‌ సాహిబ్‌ గురుద్వారా ఉంది.
 

చ‌ద‌వండి: రాణి కమలాపతి రైల్వేస్టేషన్‌ ఏ నగరంలో ఉంది?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : 2021, నవంబర్‌ 17వ తేదీ నుంచి కర్తార్‌పూర్‌ సాహిబ్‌ కారిడార్‌ పునః ప్రారంభం 
ఎప్పుడు : నవంబర్‌ 16
ఎవరు    : కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా
ఎందుకు  : భారత్‌లోని సిక్కు మతస్తులు పాకిస్తాన్‌లో ప్రార్థనా స్థలాలను సందర్శించేందుకు..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 17 Nov 2021 04:01PM

Photo Stories