Skip to main content

Janjatiya Gaurav Divas: రాణి కమలాపతి రైల్వేస్టేషన్‌ ఏ నగరంలో ఉంది?

PM Modi as Tribal attire
భోపాల్‌లో గిరిజనుల వేషధారణలో ప్రధాని మోదీ

జన జాతీయ గౌరవ్‌ దివస్‌ సందర్భంగా నవంబర్‌ 15న మధ్యప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని భోపాల్‌లో నిర్వహించిన వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని, ప్రసంగించారు. అనంతరం ఆధునీకరించిన రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌ను జాతికి అంకితం చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తదితర రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనున్న 50 ఏకలవ్య రెసిడెన్షియల్‌ స్కూళ్ల నిర్మాణానికి వర్చువల్‌ విధానం ద్వారా శంకుస్థాపన చేశారు.

కమలాపతి స్టేషన్‌: భోపాల్‌ నగరంలో ఉన్న హబీబ్‌గంజ్‌ రైల్వే స్టేషన్‌ పేరును రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌గా మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం మార్చింది. గోండ్‌ రాణి అయిన రాణి కమలాపతి జ్ఞాపకార్థం... హబీబ్‌గంజ్‌ రైల్వే స్టేషన్‌ పేరు మార్పు నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

జన జాతీయ గౌరవ్‌ దివస్‌: బ్రిటిష్‌ వలసవాదం, దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించిన గిరిజన యోధుడు బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని... గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల స్మారకార్థం నవంబర్‌ 15వ తేదీని జన జాతీయ గౌరవ్‌ దివస్‌గా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. గిరిజనుల విజయాలు, సంస్కృతిని స్మరించుకుంటూ ప్రతి ఏటా నవంబర్‌ 15 నుంచి వారం రోజులపాటు వేడుకలు నిర్వహించాలని నిర్ణయించింది.

ప్రధాని మోదీ ప్రసంగం–ముఖ్యాంశాలు

  • గోండ్‌ రాణి దుర్గావతి ధైర్యసాహసాలు, రాణి కమలాపతి త్యాగాలను దేశం ఎన్నటికీ మరువదు.
  • అంబేద్కర్‌ జయంతి, గాంధీ జయంతి, వీర్‌సావర్కర్‌ జయంతిల మాదిరిగానే భగవాన్‌ బిర్సాముండా జయంతిని ఏటా నవంబర్‌ 15న నిర్వహిస్తాం. 
  • గత ప్రభుత్వాల వీఐపీ సంస్కృతి నుంచి ఈపీఐ(ప్రతి వ్యక్తీ ముఖ్యుడే) సాధన దిశగా దేశం ప్రస్తుతం పరివర్తన చెందుతోంది.

 

Ambulance Services: గోవుల కోసం అంబులెన్స్‌లను అందుబాటులోకి తేనున్న రాష్ట్రం?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ఆధునీకరించిన రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌ ప్రారంభం
ఎప్పుడు : నవంబర్‌ 15
ఎవరు    : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ    : భోపాల్, మధ్యప్రదేశ్‌
ఎందుకు  : జన జాతీయ గౌరవ్‌ దివస్‌ సందర్భంగా..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 16 Nov 2021 01:25PM

Photo Stories