Ambulance Services: గోవుల కోసం అంబులెన్స్‌లను అందుబాటులోకి తేనున్న రాష్ట్రం?
దేశంలోనే తొలిసారిగా గోవుల కోసం అంబులెన్స్ సేవలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న గోవులను అంబులెన్స్‌ల్లో ఆసుపత్రులకు తరలించి, చికిత్స అందించనున్నట్లు రాష్ట్ర పాడి పారిశ్రామికాభివృద్ధి, పశు సంవర్థక, మత్స్యశాఖ మంత్రి లక్ష్మీనారాయణ్ చౌదరి తెలిపారు. ఇలాంటి పథకం దేశంలోనే ఇది తొలిసారి అని నవంబర్ 14న పేర్కొన్నారు. గోవులకు అంబులెన్స్ సేవల పథకాన్ని డిసెంబర్‌లో ప్రారంభిస్తామన్నారు. 515 అంబులెన్స్‌లను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఎమర్జెన్సీ సర్వీసు నెంబర్ ‘112’కు ఫోన్ చేసి, అంబులెన్స్ సేవలు పొందవచ్చని సూచించారు.
చదవండి: పరిశుభ్రమైన రాష్ట్రాల్లో తొలి స్థానంలో నిలిచిన రాష్ట్రం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశంలోనే తొలిసారిగా గోవుల కోసం అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్న రాష్ట్రం?
ఎప్పుడు : నవంబర్ 14
ఎవరు : ఉత్తరప్రదేశ్
ఎందుకు : అనారోగ్యంతో బాధపడుతున్న గోవులను అంబులెన్స్‌ల్లో ఆసుపత్రులకు తరలించి, చికిత్స అందించేందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్