Cleanest State: పరిశుభ్రమైన రాష్ట్రాల్లో తొలి స్థానంలో నిలిచిన రాష్ట్రం?
దేశంలో అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్ వరుసగా మూడో ఏడాది కూడా మొదటి స్థానంలో నిలిచింది. 2021, నవంబర్ 20వ తేదీన జరిగే స్వచ్ఛ అమృత్ మహోత్సవ్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డు అందుకోనుందని ఉన్నతాధికారులు తెలిపారు. ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించడం, దానిని శాస్త్రీయవిధానంలో పారవేయడం, బహిరంగ మల విసర్జన రహిత, వ్యర్థాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంతోపాటు పౌరుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుని ఛత్తీస్‌గఢ్‌ను ఎంపిక చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలోని 61 నగరాలు స్వచ్ఛత విషయంలో మెరుగైన పని తీరు కనబరిచాయని వివరించారు.
చదవండి >> Padma Awards 2021: పద్మ పురస్కారాల పూర్తి జాబితా
క్విక్ రివ్యూ :
ఏమిటి : అత్యంత పరిశుభ్రమైన రాష్ట్రాల్లో వరుసగా మూడో ఏడాది కూడా మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం?
ఎప్పుడు : నవంబర్ 14
ఎవరు : ఛత్తీస్‌గఢ్
ఎక్కడ : దేశంలో...
ఎందుకు : స్వచ్ఛత విషయంలో అత్యుత్తమ పనితీరును కనబరిచినందున...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్