Supreme Court: ‘ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్’పై సుప్రీం స్టే
Sakshi Education
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున్న ఫ్యాక్ట్-చెకింగ్ యూనిట్‌పై సుప్రీం కోర్టు స్టే విధించింది.
- కేంద్ర ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్–2021లో సవరణలు చేస్తూ, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఆధ్వర్యంలో ఫ్యాక్ట్-చెకింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
- ఈ యూనిట్ ప్రభుత్వంపై వచ్చే తప్పుడు వార్తలను, ఆన్‌లైన్‌లో నకిలీ కంటెంట్‌ను గుర్తించి, ఫ్లాగ్ చేస్తుంది.
- ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎడిటర్స్ గిల్డ్ ఇండియాతోపాటు పలువురు బాంబే హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
- ఈ యూనిట్ ఏర్పాటు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగం కలిగిస్తుందని వారు వాదించారు.
- ఈ తీర్పును సవాలు చేస్తూ పిటిషనర్లు సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
- సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించి, మార్చి 21న తీర్పు వెలువరించింది.
- హైకోర్టు తీర్పును తోసిపుచ్చిన సుప్రీం కోర్టు, ఫ్యాక్ట్-చెకింగ్ యూనిట్ ఏర్పాటుపై స్టే విధించింది.
Election Notification: 2024 ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఏపీలో ఎన్నికలు ఎప్పుడంటే..
Published date : 23 Mar 2024 11:00AM