Supreme Court: రూ.2 వేల నోటు రద్దుపై అత్యవసర విచారణకు సుప్రీం నో
Sakshi Education
ఎలాంటి గుర్తింపు కార్డు లేకుండానే రూ.2 వేల నోట్లు మార్పిడికి అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
ఆర్‌బీఐ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బీజేపీ నేత, న్యాయవాది అశ్వినీకుమార్ ఉపాధ్యాయ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ తరహా పిటిషన్లను వెకేషన్ బెంచ్ విచారించబోదని ధర్మాసనం జూన్ 1న స్పష్టం చేసింది. నోటిఫికేషన్ ఏకపక్షంగా ఉందని, నల్లధనం మార్పడికి వీలు కల్పిస్తుందని అశ్వినీకుమార్ వాదించారు.
కేవలం మూడు రోజుల్లోనే రూ.50 వేల కోట్ల మార్పిడి ప్రపంచంలోనే తొలిసారని పేర్కొన్నారు. ‘‘ఈ తరహా పిటిషన్లను సెలవుల సమయంలో స్వీకరించడం లేదు. సెలవుల తర్వాత సీజేఐ ఎదుట ఈ అంశాన్ని ప్రస్తావించండి’’ అని ధర్మాసనం సూచించగా ఆలోగా నల్లధనం మార్పిడి మొత్తం పూర్తయిపోతుందని అశ్వినీకుమార్ పేర్కొన్నారు.
Published date : 03 Jun 2023 10:56AM