Mumbai Terror Attacks: మారణ హోమానికి 14 ఏళ్లు..
Sakshi Education
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో పద్నాలుగేళ్ల క్రితం 2008 నవంబరు 26న పాకిస్థాన్ ఉగ్రవాదులు సృష్టించిన మారణ హోమం ఇంకా కళ్ల ముందు కదలాడుతోంది.
ప్రపంచ ఉగ్రవాద దాడుల్లోనే అత్యంత ఘోరమైన ఘటనగా 26/11 అటాక్ చరిత్రలోనే ఓ చేదు జ్ఞాపకంగా నిలిచిపోయింది. పాకిస్తాన్ వైపు సముద్ర మార్గంలో దొంగచాటుగా ప్రవేశించిన లష్కరే తోయిబా ఉగ్రమూకలు ముంబై విచ్చలవిడిగా జరిపిన కాల్పుల్లో 18 మంది భద్రతా సిబ్బంది సహా మొత్తం 166 మంది ప్రాణాలు కోల్పోగా 300 మంది వరకు గాయపడ్డారు. ఈ అటాక్‌లో మన సైనికులు టెర్రరిస్టులతో వీరోచితంగా పోరాడి ఇంకేంతో మంది ప్రాణాలను కాపాడి.. వారు అమరులయ్యారు. ఈ దాడుల్లో నేలకొరిగిన అమాయక పౌరులను, భద్రతా బలగాలను జాతి కృతజ్ఞతతో స్మరించుకుంటుందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. ‘ఈ దాడుల్లో ఎన్నో కుటుంబాలు తమ ప్రియమైన వారిని పోగొట్టుకున్నాయి. విధి నిర్వహణలో ఎందరో భద్రతా సిబ్బంది వీరమరణం పొందారు. వారందరికీ నా నివాళులు’అని తెలిపారు.
Published date : 28 Nov 2022 01:49PM