7th Indian Water Week: జల సంరక్షణపై శాస్త్రవేత్తలకు రాష్ట్రపతి సూచనలు
ఏడో విడత ‘ఇండియా వాటర్ వీక్’ను పురస్కరించుకుని శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు, పట్టణ ప్రణాళిక అధికారులతో నవంబర్ 1న జరిగిన సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగించారు. ‘దేశ జనాభా పెరుగుతోంది. జలాశయాలు, నదుల్లో నీటి లభ్యత తగ్గుతోంది. గ్రామాల్లో చెరువులు ఎండిపోతున్నాయి. స్థానిక నదులు కనుమరుగవుతున్నాయి. జల భద్రత ఆందోళనకరంగా మారింది’ అన్నారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా సమాజంలోని అన్ని వర్గాల సహకారంతో శుద్ధమైన నీటిని ప్రజలకు అందించడం సవాలుగా మారిందని ముర్ము చెప్పారు. ‘దేశంలోని జలవనరుల్లో 80% వరకు వ్యవసాయ అవసరాలకే వాడుకుంటున్నాం. ఈ పరిస్థితుల్లో నీటి సది్వనియోగం, సాగు నీటి నిర్వహణ చాలా కీలకం’అని రాష్ట్రపతి చెప్పారు. ముఖ్యంగా చిన్నారులు నీటిని పొదుపుగా వాడుకోవడం నిత్య జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలని కోరారు.
Also read: Supreme Court: స్థానిక సహకార సంఘాలకు 97వ రాజ్యాంగ సవరణ వర్తించదు
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP