Skip to main content

PM Modi Assets రూ.2.23 కోట్లు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్తులు ఏడాదిలో రూ.26 లక్షలు పెరిగాయి.
PM Modi owns assets worth Rs 2.23 crore
PM Modi owns assets worth Rs 2.23 crore

2020–21 ఆర్థిక సంవత్సరంలో ప్రధానికున్న చరాస్తుల విలువ రూ.1,97 కోట్ల నుంచి 2021–22 నాటికి  రూ.2.23 కోట్లకు చేరుకుంది. ఆయనకు స్థిరాస్తులు ఏమీ లేవు. సొంత కారు కూడా లేదు. ప్రధానమంత్రి కార్యాలయం మోదీ ఆస్తుపాస్తుల్ని ఆగస్టు 9న వెల్లడించింది. 

Also read: Bihar CM Nitish Kumar : బీహార్ సీఎంగా ఎనిమిదో సారి నితీశ్‌ ప్రమాణం.. డిప్యూటీగా తేజస్వి తేజస్వి యాదవ్‌

ప్రధాని చరాస్తులు విలువ 2022 మార్చి 31 నాటికి 2 కోట్ల 23 లక్షల 82వేల 504 రూపాయలున్నట్టుగా పీఎంఓ వెబ్‌సైట్‌లో వివరాల ద్వారా వెల్లడవుతోంది. ప్రధాని మోదీ చేతిలో ప్రస్తుతం రూ.32,250 ఉన్నాయి. గత ఏడాదితో పోల్చి చూస్తే ఆయన దగ్గరున్న డబ్బులు తగ్గిపోయాయి. గత ఏడాది ఆయన చేతిలో రూ.36,900 ఉన్నాయి. 

Also read: Indian Polity Bit Bank For All Competitive Exams: బ్రిటిషర్లు ఏ సంవత్సరంలో బెంగాల్‌లో సుప్రీంకోర్టును ఏర్పాటు చేశారు?

గుజరాత్‌లోని గాంధీనగర్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఎన్‌సీఎస్‌ శాఖ ఖాతాలో రూ.46,555 రూపాయలు ఉన్నాయి. గత ఏడాది రూ.1,52,480గా ఉన్న బ్యాలెన్స్‌ కూడా బాగా తగ్గింది. అదే అకౌంట్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రూపంలో రూ2,10,33,226 ఉన్నాయి. పోస్టాఫీసులో నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్స్‌ కింద రూ.9,05,105 ఉండగా, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీల కింద రూ.1,89,305 ఉన్నాయి. మోదీకి నాలుగు బంగారు ఉంగరాలు ఉన్నాయి. 45 గ్రాముల బరువున్న ఆ ఉంగరాలు రూ.1,73,063 విలువ చేస్తాయి.  గత ఏడాదితో పోల్చి చూస్తే ప్రధాని ఆస్తుల విలువ రూ.26 లక్షలు పెరిగి రూ.2,23,82,504కి చేరుకుంది. మోదీకి ఎలాంటి స్థిరాస్తులు లేవు. గుజరాత్‌ గాంధీనగర్‌లో తనకున్న రెసిడెన్షియన్‌ ప్లాట్‌ని ఆయన విరాళంగా ఇచ్చేశారు. సర్వే నెంబర్‌ 401–ఏ మరో ముగ్గురితో కలిసి ఉమ్మడి ఆస్తిగా ఆ జాగా ఉండేది. అయితే తన వాటాగా ఉన్న జాగాని ప్రధాని విరాళంగా ఇచ్చేశారు. ఆ జాగా మార్కెట్‌ విలువ రూ.1.10 కోట్లు

Also read: Daily Current Affairs in Telugu: 2022, ఆగష్టు 9th కరెంట్‌ అఫైర్స్‌

కేంద్ర మంత్రుల్లో 10 మంది ఆస్తుల్ని పీఎంఓ వెబ్‌సైట్‌లో అప్‌డేట్‌ చేశారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆస్తుల విలువ రూ.2.54 కోట్లు ఉంటే, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కున్న ఆస్తులు రూ.2.92 కోట్లు ఉన్నాయి. విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తనకున్న ఆస్తులు రూ.35.63 కోట్లని వెల్లడించారు.  కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డి చరాస్తులు రూ.1.43 కోట్లు కాగా స్థిరాస్తుల విలువ రూ.8.21 కోట్లుగా ఉంది. ఆయన భార్య జి. కావ్య పేరుమీద రూ.75 లక్షల వరకు అప్పులున్నాయి. 

Also read: Most Distant Star ఎరెండల్

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 10 Aug 2022 05:55PM

Photo Stories