Bihar CM Nitish Kumar : బీహార్ సీఎంగా ఎనిమిదో సారి నితీశ్ ప్రమాణం.. డిప్యూటీగా తేజస్వి తేజస్వి యాదవ్
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి గుడ్ బై చెబుతూ.. ఆయన తన రాజీనామాను గవర్నర్‌కు ఆగస్టు 9వ తేదీన (మంగళశారం) సాయంత్రం సమర్పించారు. తమకు 160 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని గవర్నర్‌కు ఇచ్చిన లేఖలో తెలిపారు. అయితే.. ఆ వెంటనే ఆర్జేడీ సహా విపక్షాల మద్దతుతో ఆయన ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సీఎంగా నితీశ్ కుమార్‌తో పాటు తేజస్వి యాదవ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు.
బీజేపీతో సంబంధాలు సరిగా లేని కారణంగా..
బీహార్‌లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో సీఎంగా ఉన్న నితీశ్ కుమార్.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే కొన్నాళ్ల నుంచి బీజేపీతో సంబంధాలు సరిగా లేని కారణంగా.. ఆ కూటమికి గుడ్‌బై చెప్పేశారు నితీశ్. బీజేపీ(77)-జేడీయూ(45) కూటమి పాలన బీహార్‌లో ముగిసిపోయింది.
గతంలో 2015 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీ(యు), ఆర్జేడీ, కాంగ్రెస్ కలిసి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అప్పుడు తేజస్వీ డిప్యూటీ సీఎంగా ఉండగా.. లాలూ మరో కుమారుడు తేజ్ ప్రతాప్ మంత్రిగా పనిచేశారు. అయితే వీరి రెండేళ్లకే ఈ కూటమి బంధం తెగిపోయింది. 2017లో ఆర్జేడీ- కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకున్న నీతీశ్ సీఎం పదవికి రాజీనామా చేశారు. అనంతరం భాజపాతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లోనూ జేడీ(యు)- భాజపా కూటమి విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో జేడీ(యు) పార్టీకి తక్కువ మెజార్టీ ఉన్నప్పటికీ.. కూటమి ప్రభుత్వానికి నీతీశ్ సారథ్యం వహించారు.