Skip to main content

'Rozgar Mela': కొత్తగా 10 లక్షల మందికి ఉద్యోగాలు

దేశంలో యువతకు కేంద్ర ప్రభుత్వం దీపావళి కానుక అందజేస్తోంది. ఏకంగా 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడానికి ‘రోజ్‌గార్‌ మేళా’ను ప్రధాని మోదీ అక్టోబర్ 22న వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించనున్నారు.
PM Modi to launch recruitment drive for 10 lakh jobs
PM Modi to launch recruitment drive for 10 lakh jobs

వివిధ శాఖల్లో ఉద్యోగాలు పొందిన 75,000 మందికి ఇదే కార్యక్రమంలో నియామక పత్రాలు అందజేస్తారని ప్రధాని కార్యాలయం(పీఎంఓ) పేర్కొంది. ప్రధాని∙ఆశయ సాధనలో రోజ్‌గార్‌ మేళా ఒక కీలకమైన ముందడుగు అని అభివర్ణించింది. ప్రతిపక్షాలు ప్రధానంగా నిరుద్యోగ సమస్యను లేవనెత్తుతూ ప్రభుత్వాన్ని తరచుగా ఇరుకునపెడుతున్న సంగతి తెలిసిందే. ఏడాదిన్నర కాలంలో కొత్తగా 10 లక్షల మందిని నియమించుకోవడానికి మిషన్‌ మోడ్‌లో పనిచేయాలని వివిధ ప్రభుత్వ విభాగాలను ప్రధాని జూన్‌లో ఆదేశించారు. ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల సంఖ్య, ఖాళీలపై కేంద్రం సమీక్ష నిర్వహించింది. ఖాళీల సంఖ్య తేలడంతో వాటిని భర్తీ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

Also read:  Daily Current Affairs in Telugu: 2022, అక్టోబర్ 20th కరెంట్‌ అఫైర్స్‌

నియామకాల ప్రక్రియ 22న 
దేశవ్యాప్తంగా ఈ నెల 22న సాగే నియామక ప్రక్రియలో 38 కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలు పాల్గొంటాయి. గ్రూప్‌–ఎ, గ్రూప్‌–బి(గెజిటెడ్‌), గ్రూప్‌–బి(నాన్‌–గెజిటెడ్‌), గ్రూప్‌–సి స్థాయిల్లో కొత్తగా ఉద్యోగులను నియమించుకుంటాయి. రోజ్‌గార్‌ మేళా ద్వారా సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌ పర్సనల్, సబ్‌–ఇన్‌స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు, ఎల్‌డీసీ, స్టెనో, ఇన్‌కం ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్లు, మల్టి–టాస్కింగ్‌ స్టాఫ్‌(ఎంటీఎస్‌) తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలు సొంతంగా లేదా యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ తదితర రిక్రూట్‌మెంట్‌ ఏజెన్సీల ద్వారా నూతన నియామకాలు చేపడతాయి. 

Also read: 90th INTERPOL General Assembly: గుర్తుగా 100 రూపాయల నాణాన్ని మోదీ విడుదల చేశారు

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

Sakshi Education Mobile App

Published date : 21 Oct 2022 06:50PM

Photo Stories