Daily Current Affairs in Telugu: 2022, అక్టోబర్ 20th కరెంట్ అఫైర్స్
Mosquito Bite: ఒంటివాసనే దోమకాటుకు మూలం
న్యూయార్క్: దోమలు. మనందరికీ ఉమ్మడి శత్రువులు. మలేరియా, జైకా, డెంగీ ప్రాణాంతక జ్వరాలకు కారణం. ఇవి కొందరినే ఎక్కువగా కుట్టడానికి కారణం ఏమిటి? ఫలానా రక్తం గ్రూప్ ఉన్నవారిని, రక్తంలో చక్కెర స్థాయిలు బాగా ఉన్నవారిని, వెల్లుల్లి, అరటిపండ్లు ఎక్కువగా తినేవారిని, మహిళలను దోమలు అధికంగా కుడుతుంటాయని అనుకుంటుంటారు. కానీ, ఇవేవీ నిజం కాదని అమెరికాలోని రాక్‌ఫెల్లర్ వర్సిటీ పరిశోధకులు తేల్చిచెప్పారు. శరీరం నుంచి వెలువడే ఓ రకం వాసనే దోమలను ఆయస్కాంతంలా ఆకర్షిస్తుందని, అలాంటి వారినే అవి ఎక్కువగా కుడుతుంటాయని తేల్చారు. ఈ వాసనకు కారణం శరీరంలోని కొవ్వు అమ్లాలు (ఫ్యాటీ యాసిడ్స్). ఇవి దోమలను ఆకర్షించే వాసనను ఈ ఉత్పత్తి చేస్తాయట! అధ్యయనం వివరాలను ‘జర్నల్ సెల్’లో ప్రచురించారు.
Also read: IIT-Roorkee Researchers: శ్వాసతోనే క్యాన్సర్‌ను కనిపెట్టొచ్చు
మస్కిటో మ్యాగ్నెట్ మారదు
చర్మంలో కార్బోజైలిక్ యాసిడ్స్ స్థాయిలు అధికంగా ఉన్నవారి పట్ల దోమలు విపరీతంగా ఆకర్షణకు గురవుతాయని అమెరికాలోని ‘రాక్‌ఫెల్లర్స్ ల్యాబొరేటరీ ఆఫ్ న్యూరోలింగి్వస్ట్ అండ్ బిహేవియర్’ ప్రతినిధి లెస్లీ వూషెల్ చెప్పారు. చర్మంలో భారీగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటే దోమల ముప్పు అధికమేనని వివరించారు. జైకా, డెంగ్యూ, ఎల్లో ఫీవర్, చికున్‌గున్యా వంటి జ్వరాలకు కారణమయ్యే ‘ఎడిస్ ఈజిప్టి’ దోమలపై మూడేళ్లు అధ్యయనం చేశారు. చర్మంలో ఫ్యాటీ యాసిడ్స్ స్థాయిలు బాగా ఉన్నవారే ఎక్కువగా దోమకాటుకు గురవుతున్నట్లు గుర్తించారు. ఆ అమ్లాల నుంచి ఉత్పత్తయ్యే గ్రీజులాంటి కార్బోజైలిక్ యాసిడ్స్ చర్మంపై కలిసి పొరలాగా పేరుకుంటాయి. వాటి నుంచి వచ్చే ఒక రకమైన వాసన దోమలను ఆకట్టుకుంటుందట!.
Also read: MIT scientists: ఇన్సులిన్ కు ప్రత్యామ్నాయంగా రోబోటిక్ మాత్ర
Covid-19: కరోనాతో ముందస్తు రజస్వల
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ముందస్తు రజస్వల అవడానికి కూడా దారి తీస్తోందన్న దిగ్భ్రాంతికరమైన విషయం తాజాగా బయట పడింది. కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా బాలికల్లో ఈ కేసులు పెరుగుతున్నట్లు సర్వేల్లో తేలింది. సాధారణంగా బాలికలు 13 నుంచి 16 ఏళ్ల వయసులో రజస్వల అవుతుంటారు. కానీ, 8 ఏళ్ల బాలికలు సైతం ఉదంతాలు బయటపడ్డాయి. ‘‘ఒకమ్మాయి నా దగ్గరికొచ్చింది. ఆమె వయసు ఎనిమిదేళ్ల తొమ్మిది నెలలు. అప్పుడే పీరియడ్స్ మొదలయ్యాయి’’ అని ఢిల్లీలోని ప్రముఖ పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ మన్‌ప్రీత్ సేథీ చెప్పారు. కరోనాకు ముందు ఎర్లీ ప్యూబర్టీ కేసులు నెలకు 10 వరకూ వచ్చేవని, ఇప్పుడు 30 దాటుతున్నాయని వెల్లడించారు. ఇటలీ, టర్కీ, అమెరికాల్లోనూ ఈ కేసులు వెలుగు చూస్తున్నాయి.
Also read: యాంటీబాడీలకు చిక్కని బీఏ.2.75.2 సబ్ వేరియంట్
కారణమేమిటి?: ముందస్తు రజస్వలకు ప్రధాన కారణం కోవిడ్–19 వ్యాప్తిని నియంత్రించడానికి ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్. విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఆ సమయంలో జనమంతా ఇళ్లకే పరిమితయ్యారు. విద్యార్థులకు ఆటపాటలు కూడా లేవు. నెలల తరబడి ఇళ్లల్లోనే ఉండిపోవాల్సి వచి్చంది. ఫలితంగా వారిలో జీవక్రియలు(మెటబాలిజం) ప్రభావితమయ్యాయి. మన మెదడు మన శరీరం ఎత్తును పరిగణనలోకి తీసుకోదు. బరువును మాత్రం పరిగణనలోకి తీసుకుంటుంది. శరీరంలో ఉత్పత్తి అయ్యే అన్ని హార్మోన్ల స్థాయిలను పిట్యూటరీ గ్రంథి పర్యవేక్షిస్తూ ఉంటుంది. శరీరం ఒక స్థాయి బరువుకు చేరుకోగానే ఈ గ్రంథి ప్యూబరీ్టని ప్రేరేపిస్తుంది. ఫలితంగా బాలికల్లో పిరియడ్స్ ప్రారంభమవుతాయి. ఇందులో హార్మోన్ల స్థాయి కూడా కీలక పాత్ర పోషిస్తాయి. అంటే బరువును నియంత్రణలో ఉంచుకుంటే ముందుస్తు రజస్వలను అరికట్టవచ్చని దీన్నిబట్టి స్పష్టమవుతోంది.
Also read: BioNTech: త్వరలో క్యాన్సర్ వ్యాక్సిన్!
Russia-Ukraine War: ఆక్రమిత ఉక్రెయిన్ ప్రాంతాల్లో... మార్షల్ లా విధించిన రష్యా
మాస్కో: ఉక్రెయిన్‌లో ఇటీవల ఆక్రమించుకున్న నాలుగు ప్రాంతాల్లో రష్యా మార్షల్ లా అమల్లోకి తెచ్చింది. దీంతో ఆ ప్రాంతాల గవర్నర్‌లకు మరిన్ని అధికారాలు దఖలుపడ్డాయి. మార్షల్ లా నేపథ్యంలో ఈ నాలుగు ప్రాంతాల్లో కొత్తగా స్థానిక రక్షణబలగాల ఏర్పాటు, ప్రయాణ ఆంక్షలు, ప్రజాసమావేశాల రద్దు, కఠిన సెన్సార్ షిప్ విధానాలు, పాలనా యంత్రాంగానికి మరిన్ని అధికారాలు వంటి చర్యలు తీసుకునే అవకాశముంది. ‘ కీలకమైన సమస్యలకు పరిష్కారం కనుగొంటూ రష్యా రక్షణ, భవిష్యత్ భద్రత కోసం శ్రమిస్తున్నాం’ అంటూ రష్యా భద్రతా మండలి సమావేశం ప్రారంభం సందర్భంగా పుతిన్ చేసిన ప్రసంగాన్ని టెలివిజన్‌లో ప్రసారంచేశారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్లోని భారతీయులు వీలైనంత త్వరగా దేశం వీడాలని అక్కడి భారత దౌత్య కార్యాలయం సూచించింది.
Also read: Ukraine war: అపార్టుమెంట్‌పై కూలిన రష్యా బాంబర్..
UK home secretary: బ్రిటన్ హోం మంత్రి బ్రేవర్మన్ రాజీనామా
లండన్: భారత సంతతికి చెందిన బ్రిటన్ హోం మంత్రి సుయెల్లా బ్రేవర్మన్ రాజీనామా చేశారు. లండన్‌లోని ఆమె కార్యాలయ వర్గాలు ఈ విషయాన్ని అక్టోబర్ 19న ధ్రువీకరించాయి. గోవా మూలాలున్న తండ్రి–తమిళనాడు మూలాలున్న తల్లికి జని్మంచిన బ్రేవర్మన్ 43 రోజుల క్రితమే యూకే హోం సెక్రెటరీగా నియమితులయ్యారు. యూకే ఆర్థిక వ్యవస్థ నానాటికీ దిగజారిపోతుండడంతో ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా చేయాలన్న డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. బ్రవెర్మన్ బుధవారం ఉదయం లిజ్ ట్రస్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం రాజీనామా సమరి్పంచినట్లు తెలిసింది. ట్రస్ విధానాలతో బ్రవెర్మన్ విభేదిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ రాజీనామా పరిణామంతో ట్రస్‌పై ఒత్తిడి మరింత పెరిగింది.
Also read: YouGov Gallup Survey: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సునాక్‌దే పైచేయి
Gujarat's Defense Expo: ‘మిషన్ స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్’ను ప్రారంభించిన మోదీ
అదాలజ్/గాందీనగర్: గుజరాత్‌లో గాంధీనగర్ జిల్లాలోని అదాలజ్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘మిషన్ స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్’ను మోదీ అక్టోబర్ 19న ప్రారంభించారు. ‘‘ఇంగ్లిష్ కేవలం ఒక భావప్రసార మాధ్యమమే. అయినా ఆ భాషలో పరిజ్ఞానముంటేనే మేధావులుగా పరిగణించే పరిస్థితి ఉంది. ప్రతిభావంతులైన గ్రామీణ యువత ఇంగ్లిష్ లో నైపుణ్యం లేదన్న కారణంతో డాక్లర్లు, ఇంజనీర్లు కాలేకపోతున్నారు’’అని వాపోయారు. ఇతర భాషల్లోనూ ఉన్నత చదువులు చదువుకొనే అవకాశం ఇప్పుడుందన్నారు.
Also read: అక్టోబర్ - అంతర్జాతీయ, జాతీయ దినోత్సవాలు
గ్రామీణ విద్యార్థులకు లబ్ధి
తన స్వరాష్ట్రం గుజరాత్‌లో విద్యారంగంలో గత రెండు దశాబ్దాల్లో ఎనలేని మార్పులు వచ్చాయని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. 1.25 లక్షల కొత్త తరగతి గదులు నిర్మించారని, 2 లక్షల మంది టీచర్లను నియమించారని ప్రశంసించారు. స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద మరో 50,000 క్లాస్‌రూమ్‌లు నిర్మించనున్నట్లు తెలిపారు. లక్ష క్లాస్‌రూమ్‌లను 5జీ టెక్నాలజీతో స్మార్ట్ తరగతి గదులుగా మార్చబోతున్నట్లు చెప్పారు. ఆన్‌లైన్‌లో పాఠాలు వినొచ్చని, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఎంతగానో లబ్ధి పొందుతారని వివరించారు. విద్యార్థులు చిన్న వయసు నుంచే పోటీ పరీక్షల కోసం సన్నద్ధం కావొచ్చని, రోబోటిక్స్ వంటి కొత్త సబ్జెక్టులు నేర్చుకోవచ్చని సూచించారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మార్చడానికి తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ‘శాల ప్రవేశోత్సవ్, గుణోత్సవ్’ వంటి కార్యక్రమాలు ప్రారంభించానని గుర్తుచేశారు.
రక్షణ స్వావలంబన గర్వకారణం
ఇకపై దేశీయంగా ఉత్పత్తి అయిన రక్షణ పరికరాలనే కొనుగోలు చేయాలని మన రక్షణ దళాలు నిర్ణయించుకోవడం సంతోషకరమని మోదీ చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్‌కు ఇది నిదర్శనమన్నారు. గుజరాత్‌లో ‘డిఫెన్స్ ఎక్స్‌పో–2022ను ప్రధాని మోదీ ప్రారంభించారు. 2021–22లో 13,000 కోట్ల రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేశామని, రూ.40,000 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. భారత్–పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో బనస్కాంతా జిల్లా దీసాలో వైమానిక స్థావరం నిర్మాణానికి మోదీ పునాదిరాయి వేశారు.
Under-23 World Wrestling Championship: తొలి భారతీయ రెజ్లర్‌గా సాజన్ భన్వాల్
పోంటెవెద్రా (స్పెయిన్): ప్రపంచ అండర్–23 రెజ్లింగ్ చాంపియన్‌ష్ ప్ చరిత్రలో గ్రీకో రోమన్ విభాగంలో పతకం నెగ్గిన తొలి భారతీయ రెజ్లర్‌గా సాజన్ భన్వాల్ గుర్తింపు పొందాడు. పురుషుల 77 కేజీల విభాగంలో సాజన్ కాంస్య పతకం సాధించాడు. కాంస్య పతక పోరులో ఉక్రెయిన్‌కు చెందిన దిమిత్రో వాసెత్‌స్కీపై సాజన్ గెలుపొందాడు. నిర్ణీత ఆరు నిమిషాల బౌట్ తర్వాత ఇద్దరూ 10–10 పాయింట్లతో సమంగా నిలిచారు. అయితే ఆఖరి పాయింట్ భారత రెజ్లర్ సాధించడంతో సాజన్‌ను విజేతగా ప్రకటించారు. హరియాణాకు చెందిన సాజన్ నాలుగో ప్రయత్నంలో అండర్–23 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించాడు. 2018, 2019లలో ఐదో స్థానం పొందిన సాజన్ 2021లో 24వ స్థానంలో నిలిచాడు. ఈసారి మాత్రం సాజన్ కాంస్యంతో మెరిశాడు.
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP