Ukraine war: అపార్టుమెంట్‌పై కూలిన రష్యా బాంబర్..
యెయెస్క్‌లోని వైమానిక స్థావరం నుంచి బయలుదేరిన ఎస్‌యు–34 రకం శిక్షణ విమానం ఒక ఇంజిన్‌లో మంటలు చెలరేగి 9 అంతస్తులున్న ఓ అపార్టుమెంట్ భవనంపై కూలింది. దీంతో, బాంబర్ విమానంలోని వేలాది లీటర్ల ఆయిల్ ఒక్కసారిగా భగ్గుమని మండిపోయింది. అపార్టుమెంట్‌లోని కొన్ని అంతస్తులు మంటల్లో చిక్కుకున్నాయి. మంటల నుంచి తప్పించుకునేందుకు ప్రాణభయంతో పైనుంచి దూకి ముగ్గురు చనిపోగా, మిగతా వారు అగి్నకి ఆహుతయ్యారని అధికారులు తెలిపారు. విమానంలోని ఇద్దరు పైలట్లు ప్రమాదానికి ముందే దూకి తప్పించుకున్నారు. మొత్తం 15 మంది మృతుల్లో ముగ్గురు చిన్నారులున్నారు. క్షతగాత్రులైన మరో 19 మందిని ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే అపార్టుమెంట్‌లోని 500 మంది నివాసితులను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. అగి్నమాపక సిబ్బంది కొన్ని గంటలపాటు శ్రమించి, మంటలను అదుపులోకి తెచ్చారు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా వైమానిక దళం వాడే విమానాల్లో అధునాతన సెన్సర్లు, ఆయుధ వ్యవస్థలున్న ఎస్–34 సూపర్‌సోనిక్ ట్విన్ ఇంజిన్ బాంబర్ ముఖ్యమైంది.
Also read: Ukraine war: కీవ్‌పై డ్రోన్ బాంబులు
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP