Ukraine war: కీవ్‌పై డ్రోన్ బాంబులు
Sakshi Education
కీవ్: వారాంతం ముగిసి సోమవారం విధుల్లోకి వెళ్లే ఉద్యోగులతో బిజీగా మారిన ఉక్రెయిన్ రాజధానిని రష్యా డ్రోన్లు చుట్టుముట్టాయి.
ఆత్మాహుతి బాంబర్లుగా మారి బాంబుల వర్షం కురిపించాయి. దీంతో బాంబు శబ్దాల హోరుతో కీవ్ దద్దరిల్లింది. ప్రాణభయంతో జనం సమీప సురక్షిత ప్రాంతాలకు పరుగులుతీశారు. బాంబుల ధాటికి పలు భవనాలు నేలమట్టమయ్యాయి. కొద్దిరోజులుగా కీవ్‌పై దాడి ఎక్కుపెట్టిన రష్యా వైమానిక దళం దెబ్బకు రాజధాని ప్రజలు నిరంతరం ఆకాశం వైపు చూస్తూ భయంభయంగా బయట సంచరిస్తున్నారు. గతంలో క్షిపణి దాడులకు దిగిన రష్యా బలగాలు ఈసారి ఇరాన్ తయారీ షహీద్(జెరాన్–2) డ్రోన్లకు పనిచెప్పాయి. కీవ్‌లో ధ్వంసమైన ఒక భవంతి శిథిలాల నుంచి 18 మందిని ఉక్రెయిన్ సేనలు సురక్షితంగా కాపాడాయి. సోమవారం నాటి దాడిలో గర్భిణిసహా నలుగురు మరణించారు.
Also read: Ukraine: ఖేర్సన్‌పై పట్టు బిగిస్తున్న ఉక్రెయిన్
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 18 Oct 2022 05:36PM