Global Investors Summit: ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2025’ సదస్సులో ప్రధాని మోదీ

భారత్ నుంచి సామాన్య ప్రజలతోపాటు ఆర్థికవేత్తలు, ప్రపంచ దేశాలు, సంస్థలు ఎంతో ఆశిస్తున్నాయని అన్నారు. మనపై ఎన్నో ఆశలు, ఆకాంక్షలు పెట్టుకున్నాయని తెలిపారు.
ఫిబ్రవరి 24వ తేదీ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ‘ఇన్వెస్ట్ మధ్యప్రదేశ్–గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2025’లో ప్రధాని మోదీ మాట్లాడారు. ప్రపంచం భవిష్యత్తు భారతదేశంలో ఉన్నదని, భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆయన చెప్పారు. ప్రపంచబ్యాంక్ కూడా ఈ అభివృద్ధిపై ఆశాభావం వ్యక్తం చేసిందని ఆయన గుర్తు చేశారు.
భారత్ సోలార్ పవర్‌లో "సూపర్ పవర్"గా ఎదిగిందని మోదీ చెప్పారు. ఐక్యరాజ్యసమితి సంస్థ భారత్‌ను వాతావరణ మార్పుల విషయంలో ప్రశంసించిందని అన్నారు. భారత్ మాటలు కాకుండా కార్యరంగంలో ఫలితాలను సాధించి చూపిస్తోందని, అంతర్జాతీయంగా ఏరోస్పేస్ రంగంలో కూడా భారత్ అతిపెద్ద సరఫరాదారుగా మారిందని పేర్కొన్నారు.
PM Modi: దేశానికి ప్రపంచస్థాయి నాయకులు అవసరం.. ‘సోల్’ సదస్సులో ప్రధాని మోదీ
గ్రీన్ ఎనర్జీ రంగంలో భారత్ చేసిన ప్రగతిని, పునరుత్పాదక ఇంధన రంగంలో 70 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని, క్లీన్ ఎనర్జీ రంగంలో 10 లక్షల ఉద్యోగాలు సృష్టించామని చెప్పారు.
మధ్యప్రదేశ్‌లో పెట్టుబడుల అవకాశాలు చాలా ఉన్నాయని, ఎలక్ట్రిక్ వాహనాలు, తయారీ రంగాల్లో ఈ రాష్ట్రం ముందంజలో ఉందని, పెట్టుబడుల కోసం 18 కొత్త విధానాలను మోదీ ఆవిష్కరించారు.
☛ Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)